»   » కేజే ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌.. నవంబర్‌ 11న హైదరాబాద్‌లో.. టికెట్ ధర ఎంతంటే..

కేజే ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌.. నవంబర్‌ 11న హైదరాబాద్‌లో.. టికెట్ ధర ఎంతంటే..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఐదు దశాబ్దాలుగా ఎన్నో ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్‌. ఈ జర్నీలో ఆయన కొన్ని కోట్ల మంది సంగీత ప్రియులను అలరించారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో, మన తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్‌ 11న లైవ్‌ కాన్సర్ట్‌ ప్రోగ్రామ్‌ చేయబోతున్నారు. గతంలో మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ హీరోయిన్‌, భరత నాట్యం డాన్సర్‌ శోభనతో ప్రోగ్రామ్‌లను నిర్వహించిన '11.2' సంస్థ ఏసుదాస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.

  K.J.Yesudas live concert in Hyderabad

  తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తన సినిమాల్లోని హిట్‌ పాటలను ఈ లైవ్‌ కనసర్ట్‌లో ఏసుదాస్‌ ఆలపించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌ జరగలేదు. తొలిసారి ఇలాంటి సంగీత వేడుక ఏసుదాస్‌ ఆధ్వర్యంలో జరనుండటం ఆయన అభిమానులకే కాదు.. సంగీతాన్ని ప్రేమించే అందరికీ పండగే అని చెప్పవచ్చు.

  K.J.Yesudas live concert in Hyderabad

  ఏసుదాస్‌తో పాటు ఆయన తనయుడు ప్రముఖ సింగర్‌ విజయ్‌ ఏసుదాస్‌ కూడా ఈ లైవ్‌ కాన్సర్ట్‌లో పాల్గొనబోతుండటం విశేషం. ఈ లైవ్‌ కాన్సర్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె.టి.ఆర్‌ విడుదల చేశారు. నవంబర్‌ 11 రాత్రి ఏడు గంటలకు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్‌ ధర రూ.1200. ఈ టికెట్స్‌ బుక్‌ మై షో ద్వారా లభ్యమవుతాయి.

  English summary
  K.J.Yesudas is perhaps the most uniquely gifted classical singer and a playback artist who has been ruling South Indian Cinema for nearly five decades till date. KJ's perform live in Hyderabad this November hosted by Eleven Point Two. This company has the credit of bringing breathtaking artists like Maestro Ilaiyaraaja, Bharatanatyam dancer Sobhana to the twin cities and enthralled the audience. Hon’ble Minister for IT, Industries, MA & UD, NRI Affairs Shri KTR has launched the anticipated poster of this event and flagged the event as well. Tickets for Yesudas live are available at Bookmyshow
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more