మహేష్ బాబుకు కథ రాయడం నా వల్ల కాదు.. బాహుబలి రైటర్ షాకింగ్ కామెంట్స్

స్టార్ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతోమంది ప్రముఖులతో వర్క్ చేశారు. ఎవరు కథలు అడిగినా సరే లేదు అనకుండా వారికి తగ్గట్లుగానే కథను రెడీ చేస్తారు. స్టార్ హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ కథలను రాయడంలో ఆయన తరువాతే ఇంకెవరైనా. రాజమౌళి చేసే ప్రతి సినిమా వెనుక విజయేంద్రప్రసాద్ కథే కీలకమని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

స్టూడెంట్ నెంబర్ 1 నుంచి త్వరలో రాబోయే RRR వరకు కథలను అందించి రాజమౌళితో సమానంగా పాన్ ఇండియా రైటర్ గా క్రెడిట్ అందుకున్నారు. ఇక ఇటీవల ఆలీతో సరదాగా షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ టాప్ స్టార్ హీరోలకు అందించే కథలపై ఉదాహరణలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదని ఆయన కోసం గత సినిమాల ఫార్మాట్ ను కాస్త ఫాలో అయితే చాలని అన్నారు.

K. V. Vijayendra Prasad about story writing for mahesh babu

ఇక మహేష్ బాబు విషయానికి వచ్చేసరికి విజయేంద్రప్రసాద్ ఎవరు ఊహించని విధంగా స్పందించారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు కథను సెట్ చేయడం చాలా కష్టమని, అంత ఈజీ జాబ్ కాదని అన్నారు. ఆ విషయంలో తప్పకుండా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ వద్ద సలహాలు తీసుకుంటానని చెప్పాడు. ఇక అల్లరి నరేష్ కథను సెట్ చేయాల్సి వస్తే మీ సలహా తీసుకుంటానని ఆలీకి సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X