For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bimbisara: కల్యాణ్ రామ్ నయా రికార్డు.. టాలీవుడ్‌లో 2వ స్థానానికి బింబిసారా

  |

  నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే మంచి పేరును సంపాదించుకుని.. స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కల్యాణ్ రామ్ ఒకడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నటుడిగా, నిర్మాతగా సందడి చేస్తోన్న ఈ హీరో.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో కల్యాణ్ రామ్ తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఎక్కువగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నాడు. దీంతో కొన్ని విజయాలతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంటున్నాడు. ఈ జోష్‌లో మరిన్ని సినిమాలు చేస్తున్నాడు.

  సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

  ప్రస్తుతం నందమూరి కల్యాణ్ రామ్ 'బింబిసారా' అనే సినిమాలో నటిస్తున్నాడు. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు దీన్ని విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల బ్రేక్‌లు వచ్చినప్పటికీ.. వీలు చిక్కినప్పుడల్లా దీన్ని శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంతో సాగే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కథతో రూపొందిన విషయం తెలిసిందే.

  Kalyan Ram Bimbisara Trailer Reaches 2nd Place in Tollywood

  నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్న 'బింబిసారా' మూవీ నుంచి గతంలో టీజర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు క్రమంగా పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ట్రైలర్‌తో ప్రారంభించింది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి నందమూరి అభిమానులే కాకుండా.. అన్ని వర్గాల వాళ్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. ఫలితంగా రికార్డు స్థాయిలో వ్యూస్, లైకులు సాధించింది.

  జబర్ధస్త్ వర్ష అందాల ఆరబోత: ఉల్లిపొరలాంటి చీరలో అదిరిపోయే హాట్ ట్రీట్

  క్రేజీ సబ్జెక్టుతో రూపొందుతోన్న 'బింబిసారా' మూవీ ట్రైలర్‌కు 24 గంటల్లోనే 9.78 మిలియన్ వ్యూస్, 299.7K లైకులు దక్కాయి. దీంతో టైర్ 2 హీరోల జాబితాలో ఎక్కువ వ్యూస్ పరంగా రెండో స్థానంలో, లైకులు పరంగా నాలుగో స్థానానికి ఇది చేరుకుంది. వ్యూస్ విభాగంలో మొదటి స్థానంలో రామ్ పోతినేని నటించిన 'ద వారియర్' ట్రైలర్ ఉంది. దీనికి 10.53 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత స్థానానికి కల్యాణ్ రామ్ సినిమా చేరుకుంది. లైకుల పరంగా నాగ చైతన్య 'లవ్ స్టోరి' 342K టాప్ ప్లేస్‌లో ఉంది. ఇందులో రెండో స్థానంలో రిపబ్లిక్, మూడో స్థానంలో శ్యామ్ సింగ రాయ్ ఉన్నాయి. బింబిసారా నాలుగో స్థానంలో నిలిచింది.

  మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'బింబిసారా' టైమ్ మెషీన్ ఆధారంగా నడిచే చిత్రమని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీనికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Nandamuri Kalyan Ram Now Doing Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Trailer Reaches 2nd Place in Tollywood.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X