For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kalyan Ram భార్య బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా.. అద్భుతమైన బిజినెస్ తో కోట్ల ఆదాయం?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరోలు ఎలాంటి గుర్తింపునందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులో కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో డిఫరెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అతని పర్సనల్ లైఫ్ విషయాల గురించి మాత్రం బయట పెద్దగా ఎవరికి తెలియదు. వీలైనంత ఎక్కువగా కళ్యాణ్ రామ్ ప్రైవసీ గానే ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక కళ్యాణ్ రామ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే ఇంటర్నెట్ ప్రపంచంలో చాలామంది సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య గురించి కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

  మొదట బాల నటుడిగా..

  మొదట బాల నటుడిగా..

  నందమూరి కళ్యాణ్ రామ్ మొదట ఎన్టీఆర్ తరహాలోనే 14 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా వెండితెరపై కనిపించాడు. 1989లో వచ్చిన బాలగోపాలుడు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారి వెండితెరపై కనిపించాడు. అయితే కళ్యాణ్ రామ్ చిన్న తనంలో కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించాడు ఇక ఆ తర్వాత పూర్తిగా చదువుపైనే శ్రద్ధ పెట్టాడు.

  సొంతంగానే..

  సొంతంగానే..

  ఇక విదేశాలకు వెళ్లిన తరువాత గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ అక్కడే కొన్నాళ్లపాటు ఉద్యోగం కూడా చేశాడట. ఇక ఆ తర్వాత మళ్లీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలి అని టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2003 లో అతను తొలిచూపులు అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అనంతరం తాతగారి పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ సృష్టించి అందులోనే సొంతంగా సినిమాలో నిర్మించుకున్నాడు. అతనొక్కడే సినిమాతో మొదటి సారి కమర్షియల్ గా సక్సెస్ అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.

   కళ్యాణ్ రామ్ భార్య

  కళ్యాణ్ రామ్ భార్య

  ఇక కళ్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే 2006 ఆగస్టు 9వ తేదీన స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె హరికృష్ణకు బాగా పరిచయమున్న ఒక బిజినెస్ మెన్ కూతురు. బాగా ఉన్నత చదువులు చదివినప్పటికి కూడా సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ కావున హరికృష్ణ వెంటనే ఒప్పేసుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఆ విషయంలో తండ్రి మాటకు విలువనిచ్చే స్వాతిని పెళ్లి చేసుకున్నాడు.

  ఫ్యామిలీ లైఫ్

  ఫ్యామిలీ లైఫ్

  స్వాతితో కళ్యాణ్ రామ్ కు పెళ్లికి ముందు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ చాలా తొందరగా క్లోజ్ అయ్యారట. ఇక కళ్యాణ్ రామ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు సౌర్య రామ్, కూతరు పేరు తారక అద్వైత. ప్రస్తుతం పిల్లలు ఇద్దరు కూడా స్కూలింగ్ దశలోనే ఉన్నారు. అయితే కళ్యాణ్ రామ్ తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంది లేదు.

  Recommended Video

  Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
  భార్య ఆలోచనతో

  భార్య ఆలోచనతో

  ఇక కళ్యాణ్ తన కూతురు అద్వైత పేరు మీద ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని కూడా స్థాపించాడు. అయితే ఆ ఆలోచన మొదట కళ్యాణ్ రామ్ భార్య స్వాతిదే అని తెలుస్తోంది. స్వాతి ఆలోచన మేరకు విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీనే కళ్యాణ్ రామ్ మొదట ఒక చిన్న స్థాయిలోనే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్ది కూడా ఆ కంపెనీ అవసరం కూడా ఎక్కువవుతుంది. మొదట ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈ సంస్థ వర్క్ చేసే మంచి క్రేజ్ అందుకుంది.

  బింబిసార సినిమాకు..

  బింబిసార సినిమాకు..


  బింబిసార సినిమాకు కూడా అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ లోనే అన్ని రకాల విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా జరిగాయి. సినిమాలో గ్రాఫిక్స్ అయితే మేజర్ హైలైట్ గా నిలిచాయి. సొంత కంపెనీ కావడంతో కళ్యాణ్ రామ్ బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నం చేయించాడు ఇక ఆ విషయంలో భార్య స్వాతి కూడా తన సలహాలు ఎక్కువగా ఇచ్చినట్లు సమాచారం. ఈ సంస్థతో కళ్యాణ్ రామ్ ప్రతి సినిమాకు కోట్లల్లోనే ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం.

  English summary
  Kalyan Ram wife swathi background and his creative studios details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X