twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ షాట్‌కి 37 టేక్స్.. శేఖర్ కమ్ముల చివరి నిముషందాకా అంతే.. 'గోదావరి' సీక్రెట్స్ బయటపెట్టిన నటుడు

    |

    సెన్సిటివ్ కథలతో సెన్సిబుల్ సినిమాలు శేఖర్ కమ్ముల చెయ్యితిరిగిన దర్శకుడు. ఎక్కడా వల్గారిటీ లేకుండా సున్నితమైన భావోద్వేగాలు , చక్కటి సన్నివేశాలతో సినిమాలు చేసే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా గోదావరి. సుమంత్, కమలినీ ముఖర్జీ, కమల్ కామరాజ్, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కూడా హిట్ గా నిలిచింది. 2006, మే 19న విడుదలైన గోదావరి చిత్రం సరిగ్గా నేటికి 15 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో నటించిన కమల్ కామరాజు పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం

    ఆ ప్రయాణమే ఈ సినిమా

    ఆ ప్రయాణమే ఈ సినిమా

    ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సుమంత్ అలాగే కమిలినీ ముఖర్జీ నటించారు. అయితే ఈ సినిమాలో సుమంత్ మరదలుగా నీతూచంద్ర నటించింది. మరదలు అంటే సుమంత్ కు చాలా ఇష్టం కానీ నీ ఉద్యోగం లేకుండా తిరుగుతున్న కారణంగా నీతు చంద్ర తండ్రి సుమంత్ ను కాదని కమల్ కామరాజుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.. అలా వీరందరూ రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే లాంచీలో వెళతారు. ఆ ప్రయాణమే ఈ సినిమా కథ.

    పాటలే సినిమాకి ప్రాణం

    పాటలే సినిమాకి ప్రాణం

    ఈ సినిమా గురించి చెప్పాలంటే రాధాకృష్ణన్ సంగీతం వేటూరి సాహిత్యం సినిమాకి ప్రాణం పోసిందని అని చెప్పాలి.. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వింటుంటే మరో లోకం లోకి వెళ్లి పోవడం ఖాయం.. ఇక ఈ సినిమాలో కమలిని ముఖర్జీ ఈ సింగర్ సునీత డబ్బింగ్ చెప్పారు ఇది కూడా అద్భుతంగా కుదిరింది. ఇలా ఒకటా రెండా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు. అయితే అవన్నీ తెరమీద విశేషాలు. కానీ తెరవెనుక జరిగిన విశేషాలు కొన్నిటిని తాజాగా నటుడు కమల్ కామరాజు పంచుకున్నారు వివరాల్లోకి వెళితే

    ఛత్రపతి షూటింగ్ గ్యాప్ లో

    ఛత్రపతి షూటింగ్ గ్యాప్ లో

    ''15 సంవత్సరాలు!! వావ్, అప్పట్లో లంచ్ తర్వాత రాజమౌళి దగ్గర పర్మిషన్ తీసుకుని(ఛత్రపతి షూటింగ్) ఫోటోగ్రాఫ్ లు పట్టుకుని తిరిగేవాడిని, రాయల్ ఆర్కోట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో శేఖర్ కమ్ముల ఆఫీస్ ఉందని తెలిసి నా దగ్గర ఉన్న ఒక ఫోటో సెట్ తీసుకొని వెళ్ళాను. ఆఫీస్ లో కో డైరెక్టర్ ప్రవీణ కొన్ని పేర్లు వ్రాయబడిన తెల్ల బోర్డు నాకు చూపించింది. బోల్డ్ అక్షరాలతో అక్షరంతో పైభాగంలో "గోదావరి" అని వ్రాసి ఉంది'' అని కమల్ పేర్కొన్నాడు.

    ఎందుకు అంతా నల్లగా

    ఎందుకు అంతా నల్లగా

    ''ఏ ఫోటోలో బాగానే ఉన్నావు కదా.. ఎందుకు అంతా నల్లగా అయిపోయావ్'' అయినా నువ్వు బాగున్నావు కానీ కాస్టింగ్ అయిపోయింది, అని చెప్పి పంపేసింది. నేను ఇంటికి వచ్చి అమ్మకి చెప్పాను, ఈ సమయంలో ప్రవీణ నుంచి కాల్ వచ్చింది. శేఖర్ గారు నన్ను చూడాలి అనుకుంటున్నారని ఆడిషన్ కి రమ్మని కోరింది. నేను అలాగే వెళ్లగా ఆడిషన్ చేశారు కానీ సెలక్ట్ అయినట్లు మాత్రం చెప్పలేదు'' అని కమల్ చెప్పుకొచ్చారు.

    హను రాఘవపూడి చెప్పడంతో

    హను రాఘవపూడి చెప్పడంతో

    కొన్ని వారాల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది ఇప్పటికిప్పుడు రాజమండ్రి బయలుదేరి రాగలరా అని, నేను నా ఫ్రెండ్స్ తో సంప్రదింపులు జరిపాక దర్శకుడు హను రాఘవపూడికి ఫోన్ చేశాను. ఆయన కూడా వెళ్ళమని ప్రోత్సహించారు. శేఖర్ కమ్ముల సినిమాలో అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు మాత్రం అవకాశం వదులుకోకు అని చెప్పడంతో అలా ఎల్బీనగర్ లో బస్సు ఎక్కి గోదావరి షూటింగ్ మధ్యలో దిగాను'' అని పేర్కొన్నారు.

    చివరి నిమిషం వరకు అంతే

    చివరి నిమిషం వరకు అంతే

    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చివరి నిమిషం వరకు తాను అనుకున్న పాత్ర కోసం శేఖర్ కమ్ముల ఎంతలా వెతుకుతారో అనే విషయాన్ని చెప్పడం కోసమేనని అన్నారు. ఇంత కష్టపడతాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా అందరి మనసులో ప్రతి క్యారెక్టర్ నిలబడి పోతుంది అని కమల్ చెప్పుకొచ్చారు. శేఖర్ ఇవ్వాల్టికి కూడా తన సినిమాల విషయంలో అదే ఫాలో అవుతారు అని పేర్కొన్నారు.

    37 టేక్స్

    ఇక మొదటి షాట్ చేస్తున్నప్పుడు దాదాపు 37 టేక్స్ తీసుకున్నానని కానీ శేఖర్ కమ్ముల చాలా ఓపిక సహనం తో షార్ట్ పూర్తి చేశారు అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా అంత అద్భుతంగా వచ్చింది అంటే దానికి కారణం ఆయనేనని కమల్ పేర్కొన్నారు. అలాగే ఆ సినిమాకి పని చేసిన వారందరికీ పేరుపేరునా కమల్ కామరాజు ధన్యవాదాలు తెలిపారు.

    English summary
    Godavari is a 2006 Telugu romance film starring Sumanth, Kamalinee Mukherjee, Neetu Chandra, Kamal kamaraj and others. Recently kamal kamaraju shared some intresting facts about Godavari shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X