For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thalaivii రిలీజ్ థియేటర్‌లోని.. జయలలితగా కంగన రనౌత్ మూవీ విడుదల ఎప్పుడంటే!

  |

  వెండితెర మీద అద్బుతమైన పాత్రలతోను, గ్లామర్ హీరోయిన్‌గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించున్న ఏకైక తార జయలలిత.. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకు తానే సాటిగా మారి.. రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మరో ఉక్కు మహిళగా పేరొందిన తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత బయోపిక్‌ ఇప్పటికే రిలీజ్‌కు సిద్దమై ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. అయితే కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం కరోనావైరస్ పరిస్థితులు సానుకూలంగా మారడంతో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇప్పటికే భారీగా అంచనాలు పెంచుకొన్న ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సినీ, రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని రేపుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తలైవి పేరుతో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

  జయలలిత పాత్రలో, ఈ బయోపిక్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న కంగన రనౌత్ తలైవి సినిమా రిలీజ్ డేట్‌ను తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రకటించారు. రిలీజ్ డేట్‌తోపాటు పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

  Kangana Ranauts Thalaivii to release on this date

  సినీ, రాజకీయ రంగంలో ఐకానిక్ పర్సనాలిటీ జీవితం బిగ్ స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి సిద్ధమైంది. తలైవి వరల్డ్ సినిమాలోకి సూపర్ స్టార్ మరోసారి ఎంట్రీ ఇవ్వడానికి అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ 10వ తేదీన తలైవి మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్నది అని కంగన రనౌత్ తన పోస్టులో వెల్లడించారు.

  నిర్మాత విష్ణు ఇందూరి సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. తలైవి జీవితం ఓ అద్బుతమైన, అనుభూతితో కూడిన ప్రయాణం. ఆమె జీవితంలోని ప్రతీ మలుపు ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి అనుభూతిని వెండితెర మీద ఆవిష్కరించడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాను అని అన్నారు.

  జయలలిత జీవితం సినీ రంగంలో గొప్ప చరిత్ర. ఆమె జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించినప్పుడే గొప్ప నటి, రెవల్యూషనరీ లీడర్‌కు ఇచ్చే గొప్ప నివాళి అని విష్ణు ఇంటూరి తెలిపారు.

  విబ్రీ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన తలైవి సినిమాకు విష్ణువర్ధన్ ఇంటూరి, షైలేష్ ఆర్ సింగ్, హితేష్ థాక్కర్, తిరుమల్ రెడ్డి, బృందా ప్రసాద్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. స్టార్ రైటర్, బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ, రచనా సహకారం అందించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని విజయేంద్ర ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు.

  నటీనటులు: కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, రాజ్ అర్జున్, మధుబాల, జుషు సేన్ గుప్తా, తంబి రామయ్య, పూర్ణ, ప్లోరా జాకబ్, భరత్ రెడ్డి, విద్యా ప్రదీప్, షణ్ముఖ రాజన్ తదితరులు
  సినిమాటోగ్రఫి: విశాల్ విట్టల్
  ఎడిటింగ్: ఆంథోని, బల్లు సలూజ
  మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
  బ్యానర్స్: విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, గోతిక్ ఎంటర్‌టైన్‌మెంట్, స్పింట్ ఫిలింస్
  రిలీజ్ డేట్: 2021-09-10

  English summary
  Bollywood queen Kangana Ranaut's Thalaivii to release in Theatres. Kangana tweeted that The story of this iconic personality deserves to be witnessed only on the big screen! Pave way, for #Thalaivii as she is all set to make a superstar entry into the world of cinema, yet again, a place where she has always belonged! Thalaivii IN CINEMAS near you on 10th September.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X