కాంతార చాప్టర్ 1తో తిరగబడిన రిషబ్ శెట్టి జాతకం.. 75 మంది స్టార్స్‌ని దాటేసి టాప్ ప్లేస్‌లో!
కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 చిత్రం భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే 450 కోట్ల రూపాయల వసూళ్లను క్రాస్ చేసిన కాంతార నేడో, రేపో 500 కోట్ల క్లబ్‌లో చేరనుంది. తద్వారా కేజీఎఫ్ 2 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కన్నడ చిత్రంగా నిలవనుంది. అన్ని అనుకున్నట్లుగా సాగితే కాంతార చాప్టర్ 1.. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాంతార చాప్టర్ 1 విజయం కారణంగా రిషబ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ వివరాల్లోకి వెళితే..
క్లాప్ బాయ్‌గా ప్రస్థానం
రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి.. కర్ణాటకలోని కెరడికి చెందిన ఆయన యక్షగానాలను ప్రదర్శిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ ఫోకస్.. సినిమాలపై మళ్లింది. బెంగళూరులోని గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న రిషబ్.. ఆ తర్వాత ఓ క్లాప్ బాయ్‌గా చిత్ర పరిశ్రలో అడుగుపెట్టారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు.. ఈ దశలో హీరో రక్షిత్ శెట్టితో రిషబ్‌కు పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది.

కాంతారతో సంచలనం
2012లో తుగ్లక్ అనే సినిమాలో తొలిసారి నటించిన రిషబ్ శెట్టి ఈ తర్వాత లూసియా, ఉలిదవరు కందంటే చిత్రాలలో కీలకపాత్రలు పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిక్కీ అనే చిత్రానికి దర్శకత్వ వహించారు రిషబ్. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించగా.. అనంతరం వీరి కలయికలో వచ్చిన కిర్రాక్ పార్టీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి రిషబ్ శెట్టికి స్టార్ డమ్ వచ్చింది. ఈ దశలో 2022లో రిషబ్ శెట్టి తీసిన కాంతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణ కన్నడ ప్రాంతంలోని జానపద కథలు, సంస్కృతిని మేళవించి తీసిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి ఏకంగా 409 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి కన్నడ చిత్ర పరిశ్రమను మరో మెట్టుపైకి ఎక్కించింది. కాంతార చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు రిషబ్ శెట్టి.
ఇండియాలో టాప్ డైరెక్టర్‌గా
తాజాగా కాంతార చాప్టర్ 1 విజయంతో రిషబ్ శెట్టి పేరు మారుమోగుతోంది. ఇండియాలోని టాప్ డైరెక్టర్‌లలో, నటులలో ఒకడిగా ఆయన క్రేజ్ సంపాదించారు. రిషబ్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టూ బాలీవుడ్‌లకు చెందిన బడా నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఆయనకి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. ఇక రిషబ్ తదుపరి సినిమా ఏంటన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది. అలాగే నటుడిగానూ రిషబ్‌కు మరిన్ని అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో తాజాగా రిషబ్ శెట్టి మరో ఘనతను అందుకున్నారు.
రిషబ్ శెట్టికి ఐఎండీబీ ర్యాంక్
ప్రపంచవ్యాప్తంగా సినిమాలు, సినీరంగానికి సంబంధించిన సమాచారం అందించడంలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఐఎండీబీ వెబ్ సైట్‌లో రిషబ్ శెట్టి టాప్ ర్యాంక్‌కి చేరుకున్నారు. ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో రిషబ్ శెట్టి 3వ స్థానంలో నిలిచారు. గత వారం ఈ లిస్ట్‌లో 75వ స్థానంలో ఉన్న ఆయన అంత మంది స్టార్స్‌ను దాటుకుని 3వ ప్లేస్‌కి చేరుకున్నారు. దాంతో రిషబ్ శెట్టి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంతార చాప్టర్ 1లో హీరోయిన్‌గా నటించిన రుక్మిణీ వసంత్ గత వారం 37వ ర్యాంక్‌లో ఉండగా.. తాజాగా 5వ స్థానానికి చేరుకున్నారు. అలాగే ఇదే చిత్రంలో కీలకపాత్ర పోషించిన గుల్షన్ దేవయ్య గత వారం 213వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏకంగా 200 మందిని దాటుకుని 22వ స్థానానికి దూసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











