Kantara Chapter 1 Trailer Review: కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రివ్యూ
దక్షిణాదిలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని, కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ బీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
కాంతార చాఫ్టర్ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ అండగా నిలిచారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో క్రేజ్ పెంచారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. నాన్న ఎలా తప్పిపోయాడు అని ఓ బాలుడు అడిగే ఎమోషనల్ సీన్‌తో ఆసక్తికరంగా ప్రారంభమై.. ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియెన్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ పూర్వీకులు అంతా ఉండేది ఇక్కడే.. అందంతా పెద్ద దంత కథ అంటూ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు.

భూమిపై అధర్మం పెరిగిపోయినప్పుడు దానిని నశింప చేజయడానికి ఈశ్వరుడు తన గణాలను పంపిస్తుంటాడు. ఈ పుణ్యభూమిని కొన్ని అగ్ని కణాలు కోలువయ్యాయి అంటూ ఆ ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం ఆసక్తికరంగా సాగింది. కాంతార అనే జైలులోకి అసలు వెళ్లకూడదు అంటూ పిల్లలకు కథ చెబుతూ భయపెట్టే ప్రయత్నం కనిపించింది. ఓ రాజు, అతడిని ఎదురించే సేనలు, ఓ బ్రహ్మరాక్షసి అంశాలు కథను మరింత ఇంటెన్స్‌గా మార్చాయి.
గిరిజన యువకుడు, యువరాణికి మధ్య ప్రేమాయణం.. వారిద్దరి రొమాన్స్ కథలో ట్విస్టుగా కనిపించింది. ఈ ఇద్దరి ప్రేమపై రాజు, అతడి అంతరంగికులు దృష్టిపెట్టారు. యువరాణితో ప్రేమ వ్యవహారం చేస్తూ.. ఆ యువకుడు రాజపీఠంపై కన్నేశాడా? అనే అనుమానాల్ని వ్యక్తం చేశారు. తమ వంశానికి ఈ వ్యవహారం కళంకం.. దానిని కాంతారతో కడిగేస్తాను అంటూ రాజు ప్రతీన పూనడం కథను మలుపుతిప్పే అంశంగా కనిపించింది.
రాజు తన సేనలతో గిరిజన ప్రాంతంపై దాడి చేయడం.. ఆ గ్రామాలకు కార్చిచ్చు పెట్టి విచక్షణారహితంగా దాడులు చ ేయడంతో ఇరు వర్గాల మధ్య భారీగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇక గిరిజన తెగ నాయకుడిగా దుష్టరాజుపై ఎలా ఎదురుదాడి చేశాడు. అతడి సేనలను ఎలా ఓడించారనే అంశాన్ని ప్రేక్షకులకు వదిలేసి.. ట్రైలర్ ద్వారా సినిమాపై భారీగా అంచనాలు పెంచారు. ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన దసరా కానుకగా రిలీజ్ కానున్నది.
కాంతార చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 రాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలను ట్రైలర్ మరింత పెంచింది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











