Rishabh Shetty: రిషబ్ శెట్టి అసలు పేరు ఇదా.. పేరు మార్పు వెనుక పెద్ద కథ..
Rishabh Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) పేరు పాన్ ఇండియా వైడ్ గా మార్మోగిపోతోంది. "కాంతార"తో ఎక్కడ లేని పాపులారిటీ సాధించిన ఈ స్టార్ హీరో అండ్ డైరెక్టర్, ఇప్పుడు ప్రీక్వెల్ మూవీ 'కాంతార: చాప్టర్ 1'తో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నారు. చిన్న సినిమాగా ప్రారంభమైన "కాంతార" జాతీయ స్థాయిలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఆ విజయాన్ని మించి "కాంతార చాప్టర్ 1" దూసుకెళ్తోందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి పేరుకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. రిషబ్ శెట్టి అసలు పేరు వేరేంట.
కర్ణాటకలోని కెరాడి అనే చిన్నగ్రామం నుంచి వచ్చిన రిషబ్ శెట్టి (Rishab Shetty)ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. తండ్రి జ్యోతిష్యుడు కాగా, కుటుంబ పరిస్థితులు మధ్యతరగతివి. చదువుకునే రోజుల్లోనే రిషబ్ తన ఖర్చుల కోసం మినరల్ వాటర్, టీ పౌడర్, సోలార్ ప్రొడక్ట్స్ అమ్మేవారు. ఫిల్మ్ మేకింగ్‌పై ఆసక్తితో ముంబైకి వెళ్లి తన సినీ ప్రయాణం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆఫీస్ బాయ్, క్లాప్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్, నిర్మాత డ్రైవర్‌గా పని చేశారు. ఫైనల్ గా 2012లో తుగ్లక్ సినిమాతో నటుడిగా నటించే అవకాశం దక్కించుకున్నారు. అనంతరం 2016లో కిరిక్ పార్టీతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా సంచలన హిట్ అవడంతో పరిశ్రమలో రిషబ్ పేరు మార్మోగింది.

అయితే 2022లో వచ్చిన కాంతార ఆయన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రిషబ్‌కి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక కాంతారకు సీక్వెల్ గా 'కాంతార: చాప్టర్ 1' అక్టోబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు వారాల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రికార్డులు తిరగరాసింది. కన్నడ సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచ వ్యాప్తం చేసింది.
'కాంతార: చాప్టర్ 1'లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంస్కృతి, ఆధ్యాత్మికత మిళితం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. కన్నడ సినిమా అయినప్పటికీ ఈ చిత్రం అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సాధించి బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన మల్టీ టాలెంట్‌ను మరోసారి రుజువు చేశాడు. ఈ విజయం తర్వాత ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా రిషబ్ శెట్టి తన పేరుతో ఉన్న ఆసక్తికరమైన రహస్యం బయటపెట్టాడు. ఆయన అసలు పేరు ప్రశాంత్. సినిమా రంగంలో రాణించాలన్న కోరికతో తండ్రి సలహాతో "రిషబ్"గా పేరు మార్చుకున్నానని చెప్పారు. 'మా నాన్న జ్యోతిష్యుడు. నా జాతక రీత్యా 'రిషబ్' అనే పేరు పెట్టుకోవాలని సూచించారు. నిజంగా పేరు మార్చుకున్నాకే నా జీవితంలో అదృష్టం కలిసొచ్చింది," అని రిషబ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన నమ్మకాలు, ఆధ్యాత్మికత ఆయన సినిమాల్లో కూడా ప్రతిబింబిస్తాయి. భూత కోల వంటి ఆచారాలు, దేవశక్తులపై విశ్వాసం ఆయన కథల్లో సహజంగా ప్రతిఫలిస్తాయి.
సినిమా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. "కాంతార: చాప్టర్ 1" రిషబ్ కెరీర్‌లోనే కాదు, మొత్తం కన్నడ సినీ పరిశ్రమ చరిత్రలో కూడా మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం కన్నడ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత బలం ఇచ్చింది.


Click it and Unblock the Notifications











