For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karate Kalyani : నా మీద కుట్ర..పవన్నక్కయ్, సంబంధాలు చూస్తున్నారు అంటూ సంచలనం!

  |

  సినిమాలో ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్ లకు ఫేమస్ అయిన కరాటే కళ్యాణి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన ఆమె అప్పటి నుంచి సినిమా విషయాలను పక్కన పెట్టి కాస్త రాజకీయాల మీద దృష్టి పెట్టారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కరాటే కళ్యాణి తాజాగా వరుస పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. ఆమె ఎవనో టార్గెట్ చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది కానీ ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావడం లేదు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  శృతిమించి

  శృతిమించి

  నటిగా, హరికథా కళాకారిణిగా, కరాటేలో నిష్ణాతురాలైన పడాల కళ్యాణి కరాటే కళ్యాణిగా మారింది. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గాయో లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ ఆమె తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ముందు నుంచి కూడా హిందుత్వ వాదుల తరఫున అండగా నిలబడే ఆమె బీజేపీలో చేరడంతో పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. కానీ ఇప్పుడు కొన్ని హిందూ సంస్థల మీద సంచలన ఆరోపణలు చేస్తూ రావడం సంచలనంగా మారింది. సాధారణంగా ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్న కొన్ని సంస్థల మధ్య వైరుధ్య భావాలుంటాయి అయితే అవి శృతిమించినప్పుడే ఇలా ఒకరి గురించి ఒకరు ఆరోపణలు చేసుకునే దాకా వెళుతుంది.

  ఆదాయపు శాఖ ఓ కన్ను వెయ్యలి

  ఆదాయపు శాఖ ఓ కన్ను వెయ్యలి

  ముందుగా నిన్న సాయంత్రం కళ్యాణి ''దందశక్తి మీద ఆదాయపు శాఖ ఓ కన్ను వెయ్యలి ఆద్దెచ్చా'' అంటూ ఒక పోస్టు పెట్టారు. దానికి సంబంధించి కొంతమంది కామెంట్లు చేయడంతో ఆమె వరుస పోస్టులు పెడుతూ పెను విధ్వంసానికి దారి తీసింది. పనికిమాలిన బుతు బగోతుల నీకు టైం వచ్చింది, నోట్, కుక్క బిస్కేట్ తిన్నావా రా బూతు బాబు, నీకు చుక్కలే ఇప్పుడు నుంచి ఫైనల్ గా పీకినవ్ తీయ్ అంటూ కామెంట్స్ చేశారు.

  పవన్నక్కయ్ అంటూ

  పవన్నక్కయ్ అంటూ

  ''బాగోతుల పవన్నక్కయ్ నా మీద రిపోర్ట్ కొట్టారు మీ ఆడంగి బ్యాచ్ కానీ fbనిజాయితీగా తీర్పనిచ్చింది మళ్ళీ.చెప్తున్నా పీకినవ్ తీయ్'', అంటూ ఎవరినో టార్గెట్ చేసింది. ఓ లప్పో దిచిమి సవ్యసాచి ఈరబద్రుడు నువ్వేనా.. మొగుళ్ళకి కపడేసుకుందమనే.. కనిపెట్టేసా అంటూ ఆమె పోస్టులలో పేర్కొన్నారు. ఎవరో అరెస్ట్ చేయిస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ''ఇక్కడ మనం చేస్తున్నది ధర్మ పోరాటం ఒకవేళ అరెస్ట్ చేశారు అనుకుంటే.. అది మనం తప్పు చేసినట్టు కాదు. స్వామి కోసం అరెస్ట్ అయినా సంతొషం'' అని పేర్కొన్నారు.

  నా పైన కుట్ర

  అలాగే ''వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు.. చెయ్యమని చెప్పాలి.. మన ప్రయత్నం మనం చేద్దాం చట్టం ఎవరి చుట్టం కాదు కాకుంటే.ఇక్కడ సమస్య..మన వాళ్ళతో కొట్లడలి. జోకర్ లతో కొట్లాడలి...నేను నిమిత్తమాతృరాలిని అయన నడిపిస్తున్నాడు నేను అడుగులు.వేస్తున్నా🙏🏻ఈ బోడి లింగం కి తొందరలో చుక్కలు స్వామీ చూపిస్తాడు, ''లింగం మామ అని పిలిచే వాళ్ళతో చేతులు కలిపి నా పైన కుట్ర. చేసేవాళ్లకి. బుద్ధి. చెబుతాను, జై శ్రీరామ్'' అంటూ పేర్కొన్నారు.

  Recommended Video

  Bazaar Rowdy Movie Hero Sampoornesh Babu Exclusive Interview | Part 3

  సంబంధాలు....చూస్తున్నారు

  ఇక మరో పోస్టులో ''నా దమ్ము ధైర్యం నీకు లేక గుంట నక్క వేషాలు వేసుకొని బతుకు..నా దారి రహదారి..నాలా.. భర్తతొ విబేధాలు వచ్చాయి ధైర్యంగా నేను విడిపోయిన అని చెప్పుకోలేరు. అవసరం అయితే ఈసారి పెళ్ళికి మీ అందరికీ పిలిచి చేసుకుంటా.. ఇక్కడ. ఫోటోలో ఉన్న.. అమ్మాయికి సంబంధాలు....చూస్తున్నారు కావలసిన వారు.. చూసే వాళ్ళని కాంటాక్ట్ చేయండి, నాకు కూడా తెలియదు...నాకు నచ్చిన వాళ్ళు దొరికితే చేసుకుంటా ఎవడికి సమాధానం ఇవ్వక్కరలేదు నా పర్సనల్ మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా..పెళ్లి చేసుకుని ఫోటోలు.

  వీడియోలు పెడతా ...బెంగ పడకండి. ..ఇంకేమైనా కావాలా ట్రోలింగ్ మెటీరియల్, ఏ మాట కావట. బాగానే బాగుంది కదా ఆమె, అదృష్టం పరీక్ష చేసుకోండి, నోట్ నన్ను అడగకండి వివరాలు నాకు పెళ్లి చేద్దాం అని చూస్తున్నా వాళ్ళని అడగండి'' అంటూ కామెంట్స్ చేశారు.

  English summary
  Actress karate kalyani made some sensational posts in facebook targetting some one.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X