For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sardar Movie: రోలెక్స్ అక్కడే ఉన్నాడు.. ఊపిరి 2కి హింట్.. నాగార్జున పాట పాడిన కార్తీ

  |

  కార్తి.. పేరుకు తమిళ హీరో అయిన తెలుగువాడిలానే భావిస్తారు టాలీవుడ్ ప్రేక్షకులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తి.. తనదైన నటనతో అనేక అభిమానులను సంపాందించుకున్నాడు. మల్లిగాడు, యుగానికి ఒక్కడు, ఖైదీ సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా సర్దార్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తి. అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యాడు. అలాగే చిత్ర బృందం కూడా సందడి చేసింది. ఈ వేడుకలో కార్తి మాట్లాడిని విషయాల్లోకి వెళితే..

   పాడుతూ అమ్మాయిలకు తెగ ట్రై చేశాను..

  పాడుతూ అమ్మాయిలకు తెగ ట్రై చేశాను..

  స్టేజ్ పై ఉన్న కార్తిని ఏదైనా పాట పాడమని కోరగా.. నాగార్జున సినిమాలోని కన్నుల్లో నీ రూపమే అనే పాట పాడి సూపర్ గా అలరించాడు కార్తి. చిన్నప్పుడు ఈ పాటలు పాడుతూ అమ్మాయిలకు తెగ ట్రై చేశాను. కానీ వర్కౌట్ కాలేదు అని కార్తి అంటే.. అందుకే ఇంత బాగా నేర్చుకున్నారు అని యాంకర్ మంజూష కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరికి నమస్కారం చెప్పిన కార్తి.. యుగానికి ఒక్కడు మూవీలోని డైలాగ్ బాగా ఫేమస్ అయిందట.. ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమిస్తున్నారే ఎవర్రా మీరంతా.. థ్యాంక్యూ లవ్యూ అని చెప్పాడు.

   హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి..

  హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి..

  ఈరోజు నాకు చాలా స్పెషల్.. అన్నయ్య నాగార్జున వచ్చారు. ఆయన ఒకసారి చెప్పారు. ఒక మంచి యాక్టర్ గా ఉండాలంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి. నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. నేను అప్పుడు పదో తరగతి. గొప్ప నటుడి కంటే మంచి మనిషిగా ఉండటం గొప్ప అని అప్పటి నుంచి అనిపించేలా చేశారు. నాగార్జున గారు కింగ్ అంటే కింగ్ అండి.

  మూవీని ఒప్పుకోడానికి ఫస్ట్ రీజన్ నాగార్జున గారు..

  మూవీని ఒప్పుకోడానికి ఫస్ట్ రీజన్ నాగార్జున గారు..

  నేను ఊరికనే చెప్పట్లేదు. నేను ఊపిరి మూవీని ఒప్పుకోడానికి ఫస్ట్ రీజన్ నాగార్జున గారు అందులో ఉన్నారనే. అప్పుడు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. మనకు చిన్నప్పుడు కొన్ని మెమోరీస్ ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలను నాకు ఊపిరి ఇచ్చింది. అవి గోల్డెన్ మెమోరీస్ అంటూ కార్తి చెబుతుండగా ఊపిరి 2 గురించి ఫ్యాన్స్ అడిగారు.

  ఒక బ్రదర్ లాంటి వాడు..

  ఒక బ్రదర్ లాంటి వాడు..

  దీంతో ఊపిరి 2నా.. చెప్పేద్దాం వంశీతో (డైరెక్టర్ వంశీ పైడిపెల్లి) అని అన్నాడు కార్తి. నాగార్జున నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. ఆయన నాకు ఎన్నో నేర్పించాడు. హెల్త్ విషయాలు గానీ, బోల్డ్ డెసిషియన్స్ గానీ, ఆయన చేసే రిస్క్ ఎవరు చేయలేరని నా అభిప్రాయం. ఆయన తీసుకొచ్చిన డిఫరెంట్ డైరెక్టర్స్ లైక్ ఆర్జీవీ గారు, మణిరత్నం గారిని తెలుగుకు తీసుకొచ్చింది మన నాగార్జున గారే.

  రోలేక్స్ అక్కడే ఉన్నాడు..

  రోలేక్స్ అక్కడే ఉన్నాడు..

  నేను చాలా సార్లు అడిగాను. ఇలాంటి డిఫరెంట్ నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతారని.. దానికి నేను ఏం చేస్తానో అది లవ్ చేస్తాను కార్తి అని నాగార్జున చెప్పారని కార్తి చెప్పుకొచ్చాడు. అలాగే స్పీచ్ చివర్లో సూర్య గురించి కార్తిని అడిగారు. అన్నయ్య గోవాలో షూటింగ్ లో ఉన్నారు.. రోలేక్స్ అక్కడే ఉన్నాడు అని కార్తి తెలిపాడు.

  English summary
  Nagarjuna Attend As Chief Guest To Karthi Starrer Sardar Movie Pre Release Event And Karthi Sung Nagarjuna Movie Song
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X