గంగమ్మ దీవెన.. 'చావు కబురు చల్లగా' చెప్పిన యంగ్ హీరో
యంగ్ హీరో కార్తికేయ 'చావు కబురు చల్లగా' చెప్పేశాడు. చడీ చప్పుడు లేకుండా తన తాజా సినిమాను స్టార్ట్ చేసేశాడు. ఈ మేరకు తాజాగా 'చావు కబురు చల్లగా' ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశాడు. టైటిల్ చాలా క్యాచీగా ఉండటంతో జనాల్లోకి వెంటనే ఎక్కేసింది.
ఇక ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కార్తికేయ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ళ చొక్కా ధరించి, సిగరెట్ వెలిగిస్తూ మాంచి కిక్కిచ్చాడు. ఆయన గత సినిమాల్లో లాగే యూత్ ఆడియన్స్‌ని మెప్పించేలా కనిపిస్తున్నాడు కార్తికేయ. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజే (గురువారం) మొదలైంది.

యువదర్శకుడు కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ 'బస్తీ బాలరాజు' పాత్రలో నటిస్తున్నాడు. సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. Rx100 మినహాయిస్తే కార్తికేయ గత సినిమాలు హిప్పీ, గుణ 369, 90ml ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడంతో ఈ సినిమాను కసితో చేస్తున్నాడట కార్తికేయ. చూడాలి మరి కార్తికేయ ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించి ఆకట్టుకుంటాడో!.


Click it and Unblock the Notifications











