దుమ్మురేపుతున్న హిప్పీ టీజర్.. హీరోయిన్‌తో హాట్ హాట్‌గా కార్తీకేయ కెమిస్ట్రీ!
RX100 సినిమాతో రొమాంటిక్ హీరోగా మారిన కార్తీకేయ తాజాగా హిప్పీ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మార్చి 20న రిలీజైన టీజర్‌కు సోషల్ మీడియా, య్యూట్యూబ్‌లో అనూహ్యమైన స్పందన వస్తున్నది.
యూత్‌కు కిక్కెక్కించే విధంగా ఉన్న హిప్పీ టీజర్ య్యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నది. 24 గంటలు గడవక ముందే 2 మిలియన్ల వ్యూస్ అంటే 20 లక్షల వ్యూస్‌ను సాధించింది.

హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటిస్తున్నది. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











