KGF2 Release Date: యష్ మూవీ థియేటర్లలోనే.. అదే డేట్‌కు విడుదల అంటూ..

కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ 2 మూవీ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నది. అయితే రెండో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతా సవ్యంగా సాగితే ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రముఖ ట్రేడ్ అనలిస్టు సుమిత్ కడేల్ వెల్లడించారు.

ఫిల్మ్ క్రిటిక్ సుమిత్ కడేల్ ట్వీట్ చేస్తూ... కేజీఎఫ్ చాప్టర్ 2 సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులన్నీ సవ్యంగా ఉంటే దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తు్నారు. అయితే కరోనావైరస్ మూడో వేవ్ పొంచి ఉన్నందున్న రిలీజ్ డేట్‌పై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. రిలీజ్ డేట్, డిజిటల్ రిలీజ్‌పై వస్తున్న వార్తలన్నీ ఊహగానాలే అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

KGF2 Release Date: Yash movie getting ready for September release

ఇదిలా ఉండగా, డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అమెజాన్‌ ప్రైమ్ వీడియో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. చిత్ర నిర్మాత, దర్శకులతో అమెజాన్ రైట్స్ గురించి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇంకా రైట్స్ విషయంలో యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిసింది.

కేజీఎఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయితే తప్పా బాక్సాఫీస్ వద్ద జోష్ కనిపించదు. కానీ బయట పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఒకవేళ అనుకోనిదేదైనా జరిగితే ప్యాన్ ఇండియా మూవీ అనేక నష్టాలకు గురి కావాల్సి వస్తుంది అని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.

కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రూపొందిన కేజీఎఫ్‌2కు సంబంధించిన నటీనటుల విషయానికి వస్తే... యష్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X