For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ - శంకర్ మూవీ నుంచి సర్‌ప్రైజ్: బర్త్‌డే కానుకగా ప్రకటన.. అది ఫ్లాప్ అయినా మరో ఛాన్స్

  |

  కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్‌ను అందుకుని తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అప్పటి నుంచి ఒకే రకమైన పంథాను ఫాలో అవుతూ తన ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తన స్టైల్‌ను మార్చుకున్న అతడు.. ప్రయోగాత్మక, భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు సౌతిండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో సినిమాను చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి పుట్టినరోజు కానుకగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. ఇంతకీ ఏంటా అప్‌డేట్? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

   చరణ్ ఖాతాలో రెండు సినిమాలు

  చరణ్ ఖాతాలో రెండు సినిమాలు

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. దీనితో పాటు చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లోనూ సిద్ధ అనే నక్సలైట్ పాత్రను పోషిస్తున్నాడతను.

  ఘాటు ఫొటోలతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తొలిసారి ఈ రేంజ్‌లో.. రెచ్చిపోయిన తెలుగమ్మాయి

  లెజెండరీ డైరెక్టర్‌తో సినిమాకు సై

  లెజెండరీ డైరెక్టర్‌తో సినిమాకు సై

  RRR, ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా చెర్రీ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది భారీ స్థాయిలో రాబోతుంది.

  ఇప్పుడదే పనిలో ఉన్న శంకర్

  ఇప్పుడదే పనిలో ఉన్న శంకర్

  శంకర్‌.. కమల్ హాసన్‌తో చాలా ఏళ్ల క్రితమే ‘భారతీయుడు 2'ను ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు రావడంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. దీంతో ఇది ఆలస్యం అవుతుందనుకున్నారు. కానీ, ఇటీవలే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో శంకర్.. చరణ్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు.

  ఒక్కొక్కరిని ప్రకటిస్తున్న టీమ్

  ఒక్కొక్కరిని ప్రకటిస్తున్న టీమ్

  రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రంలో పని చేసే టెక్నీషియన్లు, నటీనటుల వివరాలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తోంది యూనిట్. ఇప్పటికే కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ను తీసుకున్న RC15 టీమ్.. ఈ మధ్యనే దీనికి ఎస్ థమన్‌ను కూడా ఎంపిక చేసుకుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇందులో నటించే హీరోయిన్ మీద పడింది. ఈ మధ్య అదే హైలైట్ అవుతోంది.

  కియారాను కాదని రష్మిక వైపు

  కియారాను కాదని రష్మిక వైపు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవలే ఆమె స్థానంలో కన్నడ పిల్ల రష్మిక మందన్నాను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అసలు ఇందులో ఎవరు నటించబోతున్నారని మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  విడాకుల తర్వాత జీవితం ఇలా: ఆసక్తికర ఫొటో వదిలిన సుమంత్.. ‘మళ్లీ మొదలైంది' అంటూ!

  #RAP019 : Director Shankar Visits Ram-Lingusamy’s Bi Lingual Film Sets || Filmibeat Telugu
  బర్త్‌డే కానుకగా ప్రకటించారుగా

  బర్త్‌డే కానుకగా ప్రకటించారుగా

  తాజాగా RC15 నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. అది ఏమిటో కాదు.. ఈ సినిమాలో కియారా అద్వాణీని హీరోయిన్‌గా తీసుకున్నారన్న వార్తే. ఈరోజు ఆ బాలీవుడ్ బ్యూటీ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. గతంలో చరణ్.. కియారా ‘వినయ విధేయ రామ' చేశారు. అది ఫ్లాప్ అయినా ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చారు.

  English summary
  Mega Power Star Ram Charan Now Doing RRR Under Rajamouli Direction. After This he will do a film with S. Shankar. Kiara Advani On Board for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X