Just In
- 2 min ago
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
- 21 min ago
బాగా మిస్ అవుతోందట.. మళ్లీ దుబాయ్‌కి చెక్కేస్తోన్న కీర్తి సురేష్
- 24 min ago
బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు
- 46 min ago
చిన్న హీరోతో చేయాల్సిన సినిమా స్టార్ హీరో వద్దకు.. మాస్టర్ ప్లాన్
Don't Miss!
- News
ఏపీలో వేగంగా పరిణామాలు-నిమ్మగడ్డ వద్దకు ఐఏఎస్‌ల్ని పంపిన జగన్- ఏం జరుగుతోంది ?
- Sports
IPL 2021: ముంబై జట్టులో చేరిన పార్థీవ్ పటేల్.. ఆర్సీబీ నిర్ణయంపై సెటైర్స్.!
- Finance
ఢిల్లీలో రికార్డ్ గరిష్టానికి పెట్రోల్ ధరలు, వివిధ నగరాల్లో ధరలు...
- Automobiles
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
KISS టీజర్: దెయ్యం వయాగ్రా మింగితే.. మొత్తం అవే సీన్లు.. మామూలుగా లేవండీ బాబు!
ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రసీమలో చిన్న సినిమాల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్ పెట్టి తమ సినిమాను సక్సెస్ చేసుకోవాలనే తపనతో నేటితరం యువతకు గాలం వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు అమాంతం బోల్డ్ కంటెంట్, అడల్ట్ సీన్స్‌తో వస్తున్నాయి. తాజాగా విడుదలైన'కిస్' సినిమా టీజర్ చూస్తుంటే ఇదే కోవలోకి చెంది ఉంటుందని తెలుస్తోంది.

చూడటానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా రెస్పాన్స్ మాత్రం..
యూత్‌ను ఆకర్షించేలా బోల్డ్ కంటెంట్ పెట్టి థియేటర్లకు రప్పించడం నేటి దర్శకనిర్మాతలకు ఓ అస్త్రంగా మారింది. యూత్‌లో ఇలాంటి సినిమాలను, సన్నివేశాలకు ఉన్న క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ తాము ప్రెసెంట్ చేయాలనుకున్న కథను ప్రేక్షకుల ముందుంచుతున్నారు నయా దర్శకనిర్మాతలు. చూడటానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా వీటికి రెస్పాన్స్ మాత్రం బాగానే వస్తుండటం గమనించవలసిన విషయం.

కిస్.. దెయ్యం వయాగ్రా మింగితే
జి.ఎస్.కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిస్'. ధరన్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ''దెయ్యం వయాగ్రా మింగితే'' అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో నిర్మితమవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసి ఆన్‌లైన్ వేదికలను వేడెక్కించారు.

టీజర్ మొత్తం వాటితోనే నింపేశారు
టైటిల్‌కి తగ్గట్టుగానే టీజర్ మొత్తం కిస్సునలతో నింపేశారు. ఇలాంటి సినిమాలు కోరుకునేవారికి పూర్తి సంతృప్తిని కలిగించేలా ఈ టీజర్ ఉంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ అయితే మామూలుగా లేవండీ బాబు. ఇక హీరోహీరోయిన్లయితే తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి కిస్సులతో చించేశారు. మొత్తానికి టీజర్ అంతా చాలా రొమాంటిక్‌గా ఉంది.
దెయ్యం వయాగ్రా మింగితే
చిత్ర టీజర్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ.. దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని అన్నాడు. ఇంతవరకూ ఈ కాన్సెప్ట్‌తో ఏ భాషలో సినిమా రాలేదని, నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెప్పాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పాడు.