Aryan Khan నవాబ్ మాలిక్‌తో కోర్టులోనే తేల్చుకొంటాం.. సమీర్ వాంఖడే భార్య సవాల్

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే‌పై మహారాష్ట్ర రాజకీయ నేతలు తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. కొద్ది రోజలు తన భార్య క్రాంతి రేద్కర్ కెరీర్ సరిగా లేకపోవడం వల్లే ఆయన కక్షపూరితంగా బాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను కేసులో 25 కోట్ల ముడుపులను డిమాండ్ చేస్తున్నారు అనే ఆరోపణలు మహారాష్ట్రను కుదిపేశాయి. అయితే తన భర్తను టార్గెట్‌గా చేసుకొని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ కేసు దర్యాప్తను అడ్డుకోవడానికి సమీర్ వాంఖడేను వ్యక్తిగతం టార్గెట్ చేస్తున్నారని ఆమె అన్నారు

తన భర్త నిజాయితీ అధికారి. ఆయనపై చేస్తున్న వ్యక్తిగత దాడులను ప్రజలంతా గమనిస్తున్నారు. మాకు డబ్బుపై అంతగా మోజు లేదు. చాలా మంది తమ కుమారులు డ్రగ్స్ బారిన పడి నాశనం అవుతున్నారు. అలాంటి వారు బాగుపడితే అంతకంటే సంతోషం మరోటి ఉండదని చాలా మంది తల్లులు ఆవేదన చెందుతున్నారు. ఆ విషయం దిశగా నా భర్త చర్యలు తీసుకొంటున్నారు అని క్రాంతి రేద్కర్ అన్నారు.

Kranti Redkar Challenges NCP leader Nawab Mallik over allegation on Sameer Wankhede.

సమీర్ వాంఖడే గురించి చెబుతూ.. నా భర్త డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. అంతేకానీ బాలీవుడ్‌కు వ్యతిరేకంగా గానీ, మరొకరిని టార్గెట్ చేసుకోవడానికి గానీ, సోసైటిలో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని పనిచేయడం లేదు అని ఆమె అన్నారు.

డ్రగ్స్ కేసులో లోతైన దర్యాప్తు, ఏరివేత జరగకపోతే దేశం ఎలా బాగుపడుతుంది. లేకపోతే యువత మత్తులో జోగితే దేశం నాశనం అవుతుంది. నా భర్త ఎన్నోసార్లు రక్తపు మరకలతో ఇంటికి వచ్చారు. షర్ట్ చినిగిపోయిన రోజులు ఉన్నాయి. విధి నిర్వాహణలో కొన్నిసార్లు ప్రాణాలకు తెగించారు. దేశం కోసం నిజాయితీగా పనిచేశారు అని క్రాంతి రేద్కర్ పేర్కొన్నారు. తన భర్తపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నవాబ్ మాలిక్‌ను వాటిని ధైర్యం ఉంటే కోర్టుకు తీసుకెళ్లమని చెబతున్నా. ఆ విషయం కోర్టులోనే తేల్చుకొంటామని ఆమె సవాల్ విసిరారు.

భర్త సమీర్ వాంఖడే గురించి చెబుతూ.. నన్ను పెళ్లి చేసుకొనేటప్పుడే జీవితం ఇలా ఉంటుంది. అందుకు సిద్దం కావాలని చెప్పాడు. డ్రగ్స్‌పై పోరాటం చేసేటప్పుడు ఎదురయ్యే పరిస్థితులకు సిద్దంగా ఉండాలని చెప్పారు అని రిపబ్లిక్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రాంతి రేద్కర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X