twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    18 నెలల నిరీక్షణ ఫలించింది.. వాటే థాట్ గురూజీ!

    |

    విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో సరైన హిట్ అందుకోలేక పోతున్నారు. చివరిగా 2017 లో నక్షత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత మరో సినిమా ప్రకటించడానికి చాలా సమయమే పట్టింది. ఆయన ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ముందు నుంచి కూడా చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. నిజానికి రంగమార్తాండ సినిమా ఆగిపోయింది అని కొద్ది రోజుల క్రితం ప్రచారం కూడా జరగగా ఆ వార్తలు అన్నింటినీ ఆయన ఒక ఫోటో తో చెక్ పెట్టారు.

    మరాఠి బాషలో సూపర్ హిట్ గా నిలిచిన నటసామ్రాట్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో నానా పటేకర్ నటించిన పాత్రను తెలుగో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. ఇక బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్ళు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అయితే నిజానికి రంగమార్తాండ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా దర్శకుడు కృష్ణవంశీ చేసిన ఒక పోస్ట్ కూడా ఈ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది.

    Krishna Vamsi intresting post about rangamarthanda song

    ఏకంగా 18 నెలల నిరీక్షణ తర్వాత ఒక అదిరిపోయే పల్లవి ఇచ్చారని, మంచి ఆలోచన, వెయిట్ చేసినందుకు అధ్బుతమైన పల్లవి ఇచ్చారంటూ ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాక ఇప్పటిదాకా కామెడీ పాత్రలో నటించిన బ్రహ్మానందం ఈ సినిమాలో మాత్రం గుండెను పిండేసే విధంగా నటించబోతున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అలా ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉండగా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుంది, అనేది రిలీజ్ అయితే గాని చెప్పలేం.

    English summary
    As we all know director Krishna Vamsi is busy with rangamarthanda movie. He made some interesting comments about the song which was written by sirivennela sitarama sastry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X