For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishnam Raju మా ఊరి హీరో: చిరంజీవి.. మంచికి మారుపేరు: బాలయ్య, భక్త కన్నప్ప అంటూ పవన్ సంతాపం

  |

  టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. అజాత శత్రువుగా అందరికి సుపరిచితులైన ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ..

  మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు

  మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు

  నందమూరి బాలకృష్ణ తన సంతాపాన్ని తెలియజేస్తూ.. మంచితనానికి మారుపేరు కృష్ణంరాజు. ఆయన మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర వేశారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా శాశ్వత స్థానం సంపాదించారు. ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారు.

  కృష్ణంరాజు గారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజు గారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు గారు అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు.

  పెద్దన్నలా ఆప్యాయంగా అంటూ చిరంజీవి

  కృష్ణం రాజు మరణంపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా స్పందిస్తూ.. శ్రీ కృష్ణంరాజు గారు ఇకలేరు అనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో. చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సాహించారు. కృష్ణంరాజుతో కలిసి మనవూరి పాండవులు చిత్రంలో నటించాను.

  అప్పటి నుంచి మా మధ్య అనుబంధం ఎంతో ఆత్మీయంగా ఉంది. రెబల్ స్టార్ అనే పదానికి ఆయన సరైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకు, పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా తమ్ముడి లాంటి ప్రభాస్‌కు నా సంతాపం అని తెలిపారు.

  రౌద్ర రస పాత్రలతో రెబల్ స్టార్‌గా

  రౌద్ర రస పాత్రలతో రెబల్ స్టార్‌గా

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది.

  ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి అని పవన్ కల్యాణ్ అన్నారు.

  కేంద్ర మంత్రిగా విశేష సేవలు అంటూ పవన్ కల్యాణ్

  కేంద్ర మంత్రిగా విశేష సేవలు అంటూ పవన్ కల్యాణ్

  1978లో 'మన వూరి పాండవులు' చిత్రంలో శ్రీ కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. 'భక్త కన్నప్ప'లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు.

  బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

  English summary
  Rebel Star Krishnam Raju died at 82 years due to Ill health. He died at AIG hospital on September 11th moring at 3 o' clock. Here are the condolances from Chiranjeevi, Balakrishna, Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X