twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్లు ఎంత మంది ఉన్నా కల్ట్ ఫాలోయింగ్ నటుడు పవన్‌ కల్యాణ్.. మంత్రి కేటీఆర్ క్రేజీ కామెంట్స్

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే సినీ పరిశ్రమ తెలంగాణ మీ మరింత దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఆయన మాట్లాడటం మొదలు పెడుతూనే ఈ ఈవెంట్ కోసం చాలా సేపటినుంచి చాలా ఓర్పుగా కూర్చున్న తమ్ముళ్లు అందరికీ నమస్కారం అంటూ మొదలు పెట్టారు.

    కల్ట్ ఫాలోయింగ్

    కల్ట్ ఫాలోయింగ్


    కొన్నాళ్ల క్రితం చరణ్ వచ్చి పిలిస్తే చిరంజీవి గారి సినిమా ఫంక్షన్ కి వచ్చాను అని ఆ సమయంలో మాటల మధ్యలో తండ్రి మెగాస్టార్ బాబాయ్ పవర్ స్టార్ అని అంటే నన్ను మాట్లాడకుండా అరుపులతో మీ అభిమానులు జేజేలు పలికారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఒక మంత్రిగా ఇక్కడికి రాలేదు అని మీ అందరూ అభిమానించే పవన్ కళ్యాణ్ పిలవడంతో ఆయన సోదరుడిగా ఇక్కడికి వచ్చానని ఆయన వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది విలక్షణ శైలి అని ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బహుశా నాకు తెలిసినంతవరకు సూపర్ స్టార్లు ఇతర సార్లు చాలా మంది ఉంటారు కానీ ఒక విలక్షణమైన నటుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అని అన్నారు. ఆయనది కల్ట్ ఫాలోయింగ్ అని చెప్పుకొచ్చారు కేటీఆర్.

    అందరికీ ఆల్ ది బెస్ట్

    అందరికీ ఆల్ ది బెస్ట్

    మేము అందరం మా కాలేజీ రోజుల్లో మీ తొలిప్రేమ సినిమా చూసిన వాళ్ళమే అని కేటీఆర్ చెబుతుండగా పవన్ సిగ్గు పడుతూ కనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా సుమారు ఇరవై ఆరేళ్ల పాటు అదే స్టార్ డమ్ ని పెంచుకుంటూ వెళుతూ ఉండడం మామూలు విషయం కాదు అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా లో భాగమైన తమన్, సాగర్ చంద్ర, త్రివిక్రమ్ శ్రీనివాస్, రానా దగ్గుబాటి, సంయుక్త ఇలా పేరుపేరునా కేటీఆర్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

    హైదరాబాద్ కేంద్రబిందువుగా

    హైదరాబాద్ కేంద్రబిందువుగా

    తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్లుగా కేవలం తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు భారతీయ సినీ పరిశ్రమ హైదరాబాద్ మొత్తాన్ని తలమానికంగా చేయించుకోవాలి అని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. కెసిఆర్ గారి నాయకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారి అండదండలు ఉంటే కచ్చితంగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రబిందువుగా మారుతుందని నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.

    తెలంగాణలో కూడా

    తెలంగాణలో కూడా

    ఇక కాళేశ్వరంలో ఒక భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను కేసీఆర్ ప్రారంభించారు అని తద్వారా గోదావరి జలాలను ఒడిసిపట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ కారణంగా షూటింగులకు కోసం గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అదే షూటింగ్ ఇప్పుడు తెలంగాణలో కూడా చేసుకోవచ్చు అని కేటీఆర్ వెల్లడించారు.

    Recommended Video

    Bheemla Nayak Pre Release : KTR For Pawan Kalyan's Event | Filmibeat Telugu
    అద్భుతమైన విషయం

    అద్భుతమైన విషయం

    అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా తమ లాంటివారు ఈ సినిమాకోసం మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులు కూడా తీసుకువచ్చి వారి చేత ప్రదర్శనలు ఇప్పించడం అద్భుతమైన విషయం అని కేటీఆర్ వెల్లడించారు. ఇక తన ప్రసంగాన్ని ముగిస్తూ కేటీఆర్ సుమతో పని లేకుండా ఎవరి కోసం అయితే ఎదురుచూస్తున్నామో ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మైక్ ఇస్తున్నాను అంటూ నేరుగా ఆయనకు మైక్ ఇచ్చారు.

    English summary
    Power Star Pawan Kalyan's Bheemla Nayak is getting ready for Release on February 25th. In this occasion, Pre release event organised by film Unit at Yusuf guda police ground at Hyderabad. Telangana Minster KTR is the Chief Guest for Bheemla Nayak event. here is the ktr Speech At bheemla Nayak event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X