కేటీఆర్ మెచ్చిన పాట.. తనను వదలడం లేదంటూ సోషల్ మీడియాలో ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ కె. తారక రామారావు (కేటీఆర్‌)కు సినీ రంగ ప్రముఖులతో సత్సంబంధాలున్నాయన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలకు ముఖ్య అతిథిగా వెళ్లి సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయిన ఘటనలను మనం చూశాం. మంత్రిగా ఎంత బిజీగా ఉన్న సినిమాలను కూడా ప్రేమిస్తాడు.. చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటాడు. తాజాగా తనను ఓ పాట వదలడం లేదని కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

 సంచలనంగా మారిన సామజవరగమన..

సంచలనంగా మారిన సామజవరగమన..

సామజవరగమన అనే పాట కేవలం తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు దేశ విదేశాల్లోనూ మార్మోగిపోయింది.. ఇంకా మార్మోగిపోతూనే ఉంది. తెలుగు సినీ ప్రేక్షకులను తన మాయలో పడేసుకున్న పాట సామజవరగమన. ఈ ఒక్క పాటతో తమన్ స్థాయి కొన్ని వేల రేట్లు పెరిగింది. ఈ ఒక్క పాటతో అల వైకుంఠపురములో సినిమా రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఇలా ఎక్కడ చూసినా సామజవరగమన ప్రభంజనమే కనిపించేది.

వదలడం లేదు..

వంద మిలియన్ల వ్యూస్‌ను సాధించిన మొట్టమొదటి తెలుగు పాటగా స్థానం సంపాదించుకున్న సామజవరగమన.. తనను వదలడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశాడు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ కార్యక్రమానికి వెళ్లిన కేటీఆర్ ఆ పాటను వింటూ ఉన్నాడట. ఫ్లైట్ ఆలస్యమైందని, తన ఫోన్‌లో ఉన్న సామజవరగమన తనకు కంపెనీ ఇస్తోందని తెలిపాడు. వాటే బ్రిలియంట్ సాంగ్. ఇది తన మైండ్‌లోంచి వెళ్లడం లేదని ట్వీట్ చేశాడు.

మరింత సెన్సేషనల్‌..

మరింత సెన్సేషనల్‌..

ఈ ట్వీట్‌కు తమన్ స్పందిస్తూ.. ‘సర్ మీలాంటి వ్యక్తుల నుంచి ఇలాంటివి రావడంతో మా పాట ఇంకా సెన్సేషనల్ అయింది. సామజవరగమన పాట మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంద'ని అన్నాడు. తమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురములో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

బ్లాక్ బస్టర్ దిశగా..

బ్లాక్ బస్టర్ దిశగా..

ఇప్పటికే ఓవర్సీస్‌లో అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. మూడు మిలియన్ల మార్క్‌ను టచ్ చేసి చిరంజీవి రికార్డులను బద్దలు కొట్టేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లను కొల్లగొడుతూ ఇండస్ట్రీ రికార్డులపై కన్నేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X