twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లక్షీస్ ఎన్టీఆర్’ ఎవరికీ అమ్మలేదు, పుకార్లు నమ్మొద్దు: రామ్ గోపాల్ వర్మ

    |

    Recommended Video

    Ram Gopal Varma New Tweet On Lakhmis NTR Movie | Filmibeat Telugu

    వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కొన్ని పుకార్లు ప్రచారంలోకి రావడంపై వర్మ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని ఖండించారు.

    'లక్ష్మిస్ ఎన్టీఆర్'‌కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న రకరకాల వార్తల్లో నిజం లేవు. ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జీవి ఫిల్మ్స్, ఆర్జీవి, రాకేష్ రెడ్డి త్వరలో అప్డేట్ చేస్తారు. వివరాలు కోసం రాకేష్ (+919686319999)ని సంప్రదించాలంటూ వర్మ ట్వీట్ చేశారు.

    రామ్ గోపాల్ వర్మ

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' నైజాం, ఆంధ్రా రైట్స్ రూ. 9 కోట్లకు, శాటిలైట్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారు. ఎన్టీ రామారావు జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఫోకస్ చేస్తూ ఈ చిత్రం సాగుతుంది. రామారావుపై కుటుంబ సభ్యులు చేసిన కుట్రలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచిన ఉదంతాన్ని ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు.

    రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు

    రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు

    ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్'' చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ చిత్రంపై వారు పూర్తి నమ్మకంగా ఉన్నారు.

    బ్రహ్మరథం ఖాయమేనా?

    బ్రహ్మరథం ఖాయమేనా?

    ఆర్జీవి యూట్యూబ్ చానల్ ద్వారా విడుదలైన ట్రైలర్‌ ఇప్పటి వరకు దాదాపు 90 లక్షల మంది వీక్షించారు. వెన్ను పోటు పాటను 30 లక్షల వ్యూస్, ఎందుకు పాటకు 16 లక్షలు, నీ ఉనికి పాట 25 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 22న విడుదలయ్యే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే నమ్మకం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

    ఎన్టీ రామారావు పాత్ర

    ఎన్టీ రామారావు పాత్ర

    ఎన్టీ రామారావు పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామారావు చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం ఉంటుంది.

    దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు
    నిర్మాతలు :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి
    సినిమాటోగ్రఫీ : రమ్మీ
    రచన : రాం గోపాల్ వర్మ & నరేంద్ర చారి
    మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి
    ఎడిటర్ : కమల్ ఆర్
    కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల
    కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్
    లిరిక్స్ : సిరా శ్రీ
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
    ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి
    సౌండ్ డిజైన్ : యతి రాజు

    English summary
    Lakhmis NTR movie team issued this statement “There are rumours circulating about various people buying Lakshmis NTR at various prices. They all are untrue ..Gv Films, Rgv and Rakesh Reddy will themselves give the details once the deals are finalised.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X