twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఈసీ కొరడా.. కడపలో రెండు థియేటర్ల సీజ్.. ఏం జరిగిందంటే!

    |

    దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నందున్న రాజకీయ సంబంధం ఉన్న సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆంక్షలు విధించింది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎలాంటి సినిమాలను విడుదల చేయకూడదని స్పష్టంగా పోలీసులకు, ఇతర యంత్రంగాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించడంపై తాజాగా అధికారులు కన్నెర్ర చేశారు. ఇంతకు కడపలో ఏం జరిగిందంటే..

    ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఎదురుదెబ్బ

    ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఎదురుదెబ్బ

    ఏపీలో ఎన్నికలు ముగిసినందున వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఈ మేరకు రాం గోపాల్ వర్మ ప్రమోషన్‌కు వెళ్లగా విజయవాడలో పోలీసులు అడ్డుకొన్నారు. దాంతో ఈ సినిమా మరోసారి వివాదంగా మారి వార్తల్లోకెక్కింది. ఈసీ అధికారులు సినిమాను రిలీజ్ చేయవద్దని మరోసారి స్పష్టం చేశారు.

    కడప పట్టణంలో రెండు థియేటర్లలో

    కడప పట్టణంలో రెండు థియేటర్లలో

    కాగా, ఈసీ నిబంధనలు తుంగలో తొక్కి కడపలో రెండు థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించారు. దాంతో అనుమతి లేకుండా సినిమాను ప్రదర్శించడంపై ఈసీ అధికారులు సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు థియేటర్ల లైసెన్స్‌ను రద్దు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదికను ఇవ్వాలని అధికారులను కోరారు.

     కడప జేసీ విఫలమని నివేదిక

    కడప జేసీ విఫలమని నివేదిక

    నిబంధనలకు విరుద్ధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించింది వాస్తవమే. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విఫలం అయ్యారు అని ఉన్నతాధికారులు నివేదికను ఇచ్చారు. దాంతో కడప జిల్లా జేసీ కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది మీడియాకు వెల్లడించారు.

     జిల్లా జేసీపై చర్యలకు ఈసీ ఆదేశం

    జిల్లా జేసీపై చర్యలకు ఈసీ ఆదేశం

    పీఎం నరేంద్రమోదీ చిత్రంపై నెలకొన్న వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయం తీసుకొన్నది. రాజకీయ నేపథ్యంతో ఉన్న చిత్రాలు, రాజకీయ ప్రయోజనాలతో రూపొందే చిత్రాలను ఎన్నికల సమయంలో రిలీజ్ చేయడానికి వీలు లేదు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగే ప్రయోజనాలను నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాలి. అందుచేత ఎన్నికలు ముగిసిన తర్వాత సినిమాల రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలి అని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

    English summary
    Against the rules, Lakshmis NTR movie screened in Kadapa Town. In this issue, Election Commission goes serious note. EC siezes to Theatres and ready to take actions on District Joint Collectors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X