twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lata Mangeshkar: లతా మొదటి పాట ఏ వయసులో, ఎక్కడ పాడారో తెలుసా.. పాడిన వెంటనే తండ్రి ఒడిలో?

    |

    తన మధురమైన స్వరంతో దశాబ్దాల పాటు ప్రజల హృదయాలను ఏలిన లతా మంగేష్కర్ ఇప్పుడు మన మధ్య లేరు. ఫిబ్రవరి 6న ఉదయం 8:12 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. అయితే లతా మంగేష్కర్‌ ఎప్పుడు గాయనిగా మారారు? ఆమె మొదటి ప్రదర్శనలో ఆమెకు ఎదురైన అనుభవం ఏమిటి అని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం...

    సజీవంగా

    సజీవంగా

    లతా మంగేష్కర్ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె ప్రతి హృదయంలో సజీవంగా ఉంటుంది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందుకున్న జావేద్ అక్తర్ చేసిన ఒక ఇంటర్వ్యూలో లతా అనేక విషయాలు పంచుకున్నారు. తన తండ్రికి డ్రామా కంపెనీ ఉండేది కాబట్టి ఇంట్లో కూడా కూడా ఆడుతూ, పాడుతూ ఉండేవారు. నేను వాటిని వినేదాన్ని, నేను కూడా చిన్నప్పటి నుంచే పాడుతూ ఉండేదాన్ని కానీ నాన్న ముందు ఎప్పుడూ పాడలేదు, మా వంటగది చాలా పెద్దది, పాత్రలు నిల్వ చేయడానికి ఒక స్టాండ్ ఉండేది, నేను దానిపై కూర్చునేదానిని అని ఆమె వెల్లడించింది.

    పాడి వినిపించి

    పాడి వినిపించి

    మా అమ్మ ఏదైనా తయారు చేస్తూ ఉన్న సమయంలో నేను ఆమెకు నా పాట పాడి వినిపించేదాన్ని, సెహగల్ సాహిబ్ పాట నాకు చాలా నచ్చడంతో ఎక్కువగా ఆ పాట పాడే దాన్ని, కానీ అది కరెక్ట్ గా ఉండేది కాదు, దీంతో మా అమ్మ నా తల తినకు, ఇక్కడి నుండి వెళ్ళు అనే వారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే 'ఒకరోజు మా నాన్న ఎవరికో పాటలు నేర్పుతున్నారు, సాయంత్రం అయ్యింది, కాసేపటికి కిందికి వచ్చారు. నేను ఆ సమయంలో ఆడుతున్నాను, నాకు సరిగ్గా గుర్తుంది, నాకు అప్పుడు దాదాపు 5 సంవత్సరాలు అయితే మా నాన్న స్టూడెంట్ పాడేది నాకు నచ్చలేదు, నేను నాన్న దగ్గరకు వెళ్లి, బాబా ఇలా పాడరు, అని చెప్పి నేను పాడి వినిపించి ఇలా పాడాలని చెప్పాను.

    పాడాలని ఉందని

    పాడాలని ఉందని

    అప్పుడు నాన్న మా అమ్మతో గాయని ఇంట్లో ఉంటే, నేను బయట వారికి ఎందుకు నేర్పుతున్నాను అని అన్నారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నన్ను లేపి నా ముందు కూర్చో అని చెప్పి నాకు పాడాడంలో మెళుకువలు నేర్పించారు. అలా నేను ఆయన నుంచి నేర్చుకోవడం ప్రారంభించాను. అయితే స్టేజ్ మీద తన 9వ ఏట పాడటం ప్రారంభించానని లత చెప్పారు. అప్పట్లో తన కుటుంబం షోలాపూర్‌లో ఉండేదని చెప్పారు. అప్పుడు కొంతమంది తన తండ్రి వద్దకు వచ్చి, థియేటర్‌లో క్లాసికల్ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నారని చెప్పారు. దీనికి అతని తండ్రి అంగీకరించారు. లత తండ్రితో వారు మాట్లాడుతున్న మాటలు విన్నది. తర్వాత తనకు కూడా పాడాలని ఉందని తండ్రికి చెప్పింది.

     తల పెట్టి నిద్రపోయా

    తల పెట్టి నిద్రపోయా

    లతా మాటలు విని, నువ్వింకా చిన్నపిల్లవి నువ్వు ఏమి పాడతావని ప్రశ్నించారు. అయితే లతా మంగేష్కర్ పట్టుబట్టి నేను కూడా పాడతాను అని చెప్పింది. తండ్రి ఏ రాగం పాడతావని అడిగితే లతా మంగేష్కర్ మాట్లాడుతూ - మీరు బోధిస్తున్న ఖంబవతిని పాడతానని పేర్కొంది. అలా తన మొదటి షో అయిందని పేర్కొంది. లతా మంగేష్కర్ మాట్లాడుతూ, 'షో రాత్రి కావడంతో ముందు నన్ను పాడమన్నారు. నేను పాడటానికి కూర్చుని పాడాను, ప్రజలు దానిని ఇష్టపడ్డారు. అప్పుడు నాన్న వచ్చి పాడారు. ఆయన పాడుతుంటే నాన్న ఒడిలో తల పెట్టి నిద్రపోయాను. కాబట్టి ఇది నా మొదటి కార్యక్రమం అని వెల్లడించారు.

    83 ఏళ్లు

    83 ఏళ్లు

    అంతేకాదు. లతా మంగేష్కర్ కూడా తన షోకి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. లతా మంగేష్కర్ తన ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, 'ఈరోజు మాకు పరిచయమైన ఉపేంద్ర జీ నుండి కాల్ వచ్చింది, మీరు 9 సెప్టెంబర్ 1938న షోలాపూర్‌లో మీ తండ్రితో కలిసి మీ మొదటి శాస్త్రీయ ప్రదర్శన ఇచ్చారని ఆయన నాకు చెప్పారు. ఆ సమయంలో షో పబ్లిసిటీ కోసం తీసిన ఫోటో ఇది. పాడి 83 ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. అంటూ ఆమె దాన్ని పంచుకున్నారు.

    English summary
    Lata Mangeshkar Was 9 Year Old When She Presented Her First Classical Performance With Her Father
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X