For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దర్శకుడు వినాయక్ చేతుల మీదుగా యమ్6 మూవీ ట్రైలర్

  |

  విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాధ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం 'యమ్6'. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో హీరో ధ్రువ, నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పాల్గొన్నారు.

  మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

  ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ ''వినాయక్‌గారి చేతులమీదుగా మా 'యమ్6' ట్రైలర్ విడుదల కావడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఎంతో క్వాలిటీగా నిర్మించాం. దర్శకుడు జైరాం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మా హీరో ధ్రువ కొత్తవాడైనప్పటికీ చక్కటి నటనను ప్రదర్శించాడు. ఈ చిత్రంలో ధ్రువ సరసన మిస్ బెంగళూరు అశ్విని హీరోయిన్‌గా నటించింది. ఆమెకు ఇదే తొలి సినిమా. మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం, సస్పెన్స్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి.

  M6 trailer launched by Director VV Vinayak

  ప్రేక్షకులు సినిమాలోని ప్రతి సీన్‌ని ఎంతో ఎంజాయ్ చేస్తూ చూస్తారు. ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఉత్కంఠను కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. 'యమ్6' అనే డిఫరెంట్ టైటిల్‌ని ఈ సినిమాకు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచే 'ఈ క్షణం...' అనే మెలోడీ సాంగ్‌ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరిగింది. ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

  M6 trailer launched by Director VV Vinayak

  హీరో ధ్రువ మాట్లాడుతూ ''హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక. నిర్మాత విశ్వనాథ్ తన్నీరు, దర్శకుడు జైరామ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడా ఇబ్బంది పడకుండా నటించగలిగాను. ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక మంచి సినిమా ద్వారా నేను హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా మొదటి సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్‌గారు ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమాను, నన్ను ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు'' అన్నారు.

  M6 trailer launched by Director VV Vinayak

  ధ్రువ, శ్రావణి, అశ్విని, తిలక్, సాధన, అప్పలరాజు, హరిత, వంశీ, ఇంద్రతేజ నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, సినిమాటోగ్రఫీ: మహ్మద్ రియాజ్, కో- ప్రొడ్యూసర్: సురేష్, నిర్మాత: విశ్వనాథ్ తన్నీరు, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జైరామ్ వర్మ

  English summary
  M6 movie is directed by VishwanathTanneeru. Dhruva is the hero for the movie. This movie trailer was launched by Director VV Vinayak.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X