twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానవత్వం చూపిన హేమ, సురేఖావాణి, రజిత.. కార్డులేని అసిస్టెంట్లకు చేయూత

    |

    టాలీవుడ్‌లో కరోనావైరస్ లాక్‌డౌన్ పరిస్థితులు రోజు వారీ వేతన కార్మికులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. పని, వేతనాల లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో సినీ కళాకారులు యూనియన్లు తమవంతు బాధ్యతగా ఆర్థిక, ఇతర వస్తు రూపేణా సహాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్టుల సంఘం ఆర్టిస్టులు. మా స‌భ్యుల్లో హేమ‌, సురేఖా వాణి, రజిత, జయలక్ష్మి, సనా, ప్రవీణ,, హిమజ, మాధవి, మా మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వెంకట గోవిందరావు, ఇంకా హేమ కూతురు ఈషా, సురేఖవాణి కూతురు సుప్రీత, జయలక్ష్మి కూతురు శృతి త‌దిత‌రులు కార్డ్ లేని అసిస్టెంట్ల‌కు డొనేష‌న్లు అందించారు.

    అయితే ఏ శాఖ‌కు చెంద‌కుండా యూనియ‌న్ కార్డ్ లేకుండా పొట్ట పోషించుకోవ‌డానికి వ‌చ్చిన కార్మికుల‌ను ఆదుకోవ‌డం ఎలా? అన‌ధికారికంగా ఇలాంటి వాళ్లు వేల‌ల్లో ఉన్నారు. అందుకే అలా కార్డ్ లేకుండా క‌ష్టాల్ని ఎదురీదుతున్న పేదల్లో కార్డ్ లేని వారికి వీరంతా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు.

    MAA help to Cardless assistants in Tollywood

    ఈ సంద‌ర్భంగా హేమ మాట్లాడుతూ... యూనియన్లలో కార్డు లేని అసిస్టెంట్లు చాలా మంది ఉన్నారు. వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సాయం చేస్తున్నాం. సెట్లో మ‌మ్మ‌ల్ని బాగా చూసుకునేది అసిస్టెంట్లే. కొంద‌రు డొనేష‌న్లు ఇచ్చిన మ‌హిళా ఆర్టిస్టులు రాలేక‌పోయారు. వారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.

    సురేఖా వాణి మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అంద‌రికీ నిత్వవ‌స‌రాలు పంచుతున్నారు. అవే కాకుండా ఇంట్లో ఇంకా అవ‌సారాలుంటాయి. గ్యాస్ .. పాలు స‌హా ఇంకా అర్జెంట్ నీడ్స్. అందుకే వారికి డ‌బ్బును సాయం చేస్తున్నాం అని తెలిపారు.

    MAA help to Cardless assistants in Tollywood

    రజిత మాట్లాడుతూ ఈ కరోనా కారణంగా చాలామంది ఇబ్బంది గురవుతున్నారు అసోసియేషన్ లో ఉన్న కొంత మంది కార్మికులకి సహాయం అందుతుంది కార్డు లేని వారికి సాయం చేయాలని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు ఇవ్వడం జరిగింది" అన్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మ‌హిళా ఆర్టిస్టులు పాల్గొన్నారు.

    English summary
    MAA help to Cardless assistants in Tollywood. Actress Hema, Surekha Vani, Rajitha and other artists come forward to help workers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X