For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రేకింగ్: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా.. విష్ణు మంచును సంకటంలో పడేసిన ప్రకాశ్ రాజ్

  |

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల తర్వాత అందరూ ఊహించినట్టే రాజీనామాల పర్వం కొనసాగుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో పోటీ చేసి గెలిచిన సభ్యులందరూ రాజీనామాలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. దాంతో ఈ ఎన్నికల ప్రక్రియ మరో మలుపు తిరిగింది. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..

  విష్ణు మంచు పెద్ద హామీలు ఇచ్చారు

  విష్ణు మంచు పెద్ద హామీలు ఇచ్చారు


  రెండు సంవత్సరాలు మంచు విష్ణు అధ్యక్షుడిగా పనిచేయాలి. ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు. ఆయన పనులకు అడ్డు ఉండకూడదు. ఒకవేళ పనిచేయకపోతే మా మీద నిందలు వేయకూడదని, సినిమా బిడ్డల ప్యానల్ నుంచి గెలిచిన అందరు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. మా పదవులకు రాజీనామా చేస్తున్నాం. మీ ఇష్టం ఉన్న వ్యక్తులను మీ ప్యానెల్‌లో పెట్టుకొని పనిచేయండి. ఒకవేళ మీరు పనిచేయకపోతే ప్రశ్నిస్తాం. మాకు కూడా మీతో సమానంగా ఓట్లు వచ్చాయి. మాకు ఓటేసిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేస్తాం. విష్ణు మంచు టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

  అలా అయితే రాజీనామాను వెనక్కి తీసుకొంటా

  అలా అయితే రాజీనామాను వెనక్కి తీసుకొంటా

  మా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే ఎన్నికల రిజల్ట్‌ను మార్చేశారు. ఇంకా అక్రమాలు కొనసాగుతున్నాయి. అందుకే మేము మంచు విష్ణు ప్యానెల్ తమ హామీలను నెరవేర్చడానికి మేము సహకరించేలా పనిచేస్తాం. తప్పు జరిగితే మేము ప్రశ్నిస్తాం. నేను రాజీనామా చేశాను. కానీ మంచు విష్ణు ఆమోదించనని చెప్పారు. ఒకవేళ తెలుగు వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు అని నిబంధనలు మార్చకుంటే నేను నా సభ్యత్వానికి చేసిన రాజీనామాను వాపసు తీసుకొంటాను అని చెప్పారు.

  మా సభ్యులు రాజీనామా లేఖ ఇదే..

  మా సభ్యులు రాజీనామా లేఖ ఇదే..

  ఏ సంస్థ ముందుకెళ్లాలంటే.. ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు, ఒకేలా ఉండటం అవసరం. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యం గా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుంది అని ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ సభ్యులు తమ లేఖలో పేర్కొన్నారు.

  వీకే నరేష్ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొంటూ..

  వీకే నరేష్ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొంటూ..

  గత రెండేళ్లలో శ్రీ నరేష్ గారు "మా" అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే అయ్యి, "మా" కోసం ఏ పనీ జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారు, జరిగిన గొప్ప పనులపై కూడా ~రద చల్లారు. ఇపుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుద్దేమో అనే సంశయం తో ఉన్నాం.

  మేము ప్రశ్నిస్తాం అంటూ

  మేము ప్రశ్నిస్తాం అంటూ


  ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో శ్రీవిష్ణు గారి ప్యానల్ నుండి కొందరు, శ్రీ ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్ నుండి కొందరు గెలవడం జరిగింది. మళ్లీ మాలో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది, సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మేము
  అడగకుండా ఉండలేము. అందుకని "మా" సంస్థని శ్రీ విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము "మా" పదవులకు మనసా వాచా కర్మణా, రిజైన్ చేస్తున్నాం.

  Recommended Video

  Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
  మా బాధ్యతను నిలబెట్టుకొంటాం అంటూ

  మా బాధ్యతను నిలబెట్టుకొంటాం అంటూ

  అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత
  మాకుంది. అందువల్ల భవిష్యత్తు లో "మా" లో ఏ అభివృద్ధి జరక్కపోయినా,
  సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు రిలీజ్ చేశారు.

  English summary
  MAA Elections 2021's Voting is going with high tension mode. MAA Into Deep Crisis: Prakash Raj Panel members resigned
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X