నిజంగా శ్రీమంతుడే.. ఆయనతో పనిచేయడం గొప్ప ఫీలింగ్.. శృతిహాసన్
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో దర్శకుడు కొరటాల శివ స్పందించారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల సందర్బంగా చోటుచేసుకొన్న అనుభవాలను కొరటాల పంచుకొన్నారు. ఆయన ఏమన్నారంటే
మహేష్ బాబు 25వ సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. 35, 45, 55 సినిమాలే కాకుండా మరిన్నీ రావాలని కోరుకొంటున్నాను. మీతో కలిసి శ్రీమంతుడు చిత్రంలో నటించే అవకాశం రావడం గొప్పగా ఫీలవుతాను. మీతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. నిజంగా ఆయన శ్రీమంతుడే అని శృతిహాసన్ అన్నారు.

మే 9వ తేదీన రిలీజ్ కానున్న మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











