Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ జోష్.. శ్రీవారికి మొక్కు చెల్లించుకొన్న మహేష్‌బాబు
సరిలేరు నీకెవ్వరు ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్రయూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం తిరుపతికి బయల్దేరిన సరిలేరు టీమ్.. నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, విజయశాంతి, మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

బాక్సాఫీస్ వద్ద సరిలేరు జోరు..
మహేష్ బాబు మ్యానియా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తిరుగులేని కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నైజాం కింగ్ మహేష్ బాబు..
టాలీవుడ్‌కు ఎక్కువ రెవిన్యూ వచ్చే నైజాంలో మహేష్‌కు మంచి పట్టున్న సంగతి తెలిసిందే. తెలుగు హీరోల్లో ఎవరికీ లేనటువంటి అరుదైన రికార్డు మహేష్ పేరిట ఉంది. ఇప్పటి వరకు ఆరుసార్లు ఇరవై కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఘనత మహేష్‌కు మాత్రమే సొంతం. తాజాగా సరిలేరు చిత్రం దాదాపు 25కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.
|
శ్రీవారి సేవలో సరిలేరు బృందం..
తమ చిత్రం ఘన విజయం సాధించినందుకు సరిలేరు యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. నేటి సాయంత్రం హన్మకొండలో విజయోత్సవ వేడుకను సెలెబ్రేట్ చేయనున్నారు.

వైవీ సుబ్బారెడ్డితో భేటీ
సరిలేరు టీమ్, ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మహేష్ బాబు.. అనంతంర టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో భేటీ అయ్యాడు. ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తోందని తెలుస్తోంది. ఇక రేపో ఎల్లుండో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.