గౌతమ్‌ను విసిగిస్తున్న మహేష్ బాబు.. నమ్రతా పోస్ట్ వైరల్
కరోనా దెబ్బకు స్టార్ హీరోలంతా ఇంటి పట్టునే ఉంటారు. అయితే ఇంట్లో ఉన్న స్టార్స్‌లో కొందరు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటే మరికొందరు మిస్ అయిన సినిమాలు, నచ్చినపుస్తకాలు చదువుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇంకొందరు హీరోలు వర్కౌట్లు చేసుకుంటూ తదుపరి చిత్రాల కోసం రెడీ అవుతున్నారు. వీరందరిలో కెల్లా మహేష్ బాబు మాత్రం ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ముందు విధించిన 21 రోజుల లాక్ డౌన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మహేష్ బాబు.. మరో 19 రోజుల లాక్ డౌన్‌కు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటూ పిల్లలతో సరదాగా గడిపేస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా నమ్రతా శిరోద్కర్ మహేష్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటోంది. తాజాగా నమ్రతా షేర్ చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది.
View this post on InstagramA post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

'ఆటను గెలవడానికి కొడుకు ప్రయత్నిస్తూ ఉంటే.. కూతురు, తండ్రి మధ్యలో చెడగొడుతూ ఉంటే.. బుద్దిమంతుడైన నా కొడుకు వారిద్దరికి చిరునవ్వుతో లొంగిపోయాడు.. ప్రేమతో ఒకరికొకరు.. మీరు కూడా మీ విషయాలను చెప్పండ'ని మహేష్ చేసే అల్లరిని నమ్రత ఫోటో రూపంలో బయటకు వదిలింది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











