twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొడుకు గౌతమ్‌పై మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్.. చిన్నప్పటి క్యూట్ ఫోటో వైరల్

    |

    టాలీవుడ్ స్టార్ హీరోల తనయులపై అభిమానులు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆయన పిల్లలపై కూడా అదే స్థాయిలో ప్రేమను చూపిస్తారు. గత రాత్రి నుంచి మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే నేడు గౌతమ్ 14వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజుపై మహేష్ కూడా ఎమోషనల్ గా స్పందించడం నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

    మరో తరం వారసుడిగా..

    మరో తరం వారసుడిగా..

    ఘట్టమనేని కృష్ణ వారసుడిగా మహేష్ బాబు తనదైన శైలిలో బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇక మరో తరం వారసుడిగా ఆయన తనయుడు గౌతమ్ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడాని చెప్పవచ్చు. ఇప్పటికే 1 నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ లా కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నాడు.

    మహేష్ ఎమోషనల్ పోస్ట్

    ఇక నేటితో గౌతమ్ కి 14 ఏళ్ళు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ కొడుకుపైన తన ప్రేమను ఈ విధంగా చాటుకున్నాడు. హ్యాపీ బర్త్ డే మై సన్. నువ్వు ఒక యంగ్ మ్యాన్ గా ఎదుగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. డోరే మ్యాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వరకు నీతో పాటు ఎదిగే ఈ జర్నీ చాలా బావుంది. లవ్యూ.. హ్యాపీ బర్త్ డే గౌతమ్ ఘట్టమనేని అంటూ మహేష్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    మహేష్ స్పెషల్ ఫొటోస్

    మహేష్ స్పెషల్ ఫొటోస్

    గౌతమ్, మహేష్ బాబు ఎంత ఫ్రెండ్లిగా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రెండు ప్రత్యేకమైన ఫొటోలను కూడా మహేష్ పోస్ట్ చేశాడు. గౌతమ్ ని చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటో తో పాటు రీసెంట్ గా ముద్దాడిన ఫోటోను కూడా మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు కూడా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా షేర్ చేసుకుంటున్నారు.

    Recommended Video

    Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
    మళ్ళీ వెండితెరపై ఎప్పుడో..

    మళ్ళీ వెండితెరపై ఎప్పుడో..

    సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబుగా కనిపించిన గౌతమ్ మళ్ళీ వెండితెరపై ఎప్పుడు దర్శనమిస్తాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక గౌతమ్ ప్రస్తుతం పూర్తిగా ఎడ్యుకేషన్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక చదువు పూర్తయిన తరువాతే గౌతమ్ ఎంట్రీ ఉంటుందని మహేష్ పలు ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చారు.

    English summary
    The love that fans show for the grandchildren of Tollywood star heroes is not all. Mahesh Babu fans show the same level of love for his children. Photos of Mahesh Babu's son Gautam Ghattamane have been going viral since last night. Because today Gautam has entered the 14th spring. Netizens are also impressed with Mahesh's emotional response to this birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X