Indira Devi no more మహేష్‌బాబు తల్లి అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే?
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ అభిమాన నటుడు కుటుంబంలో జరిగిన విషాదాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మహేష్ బాబుకు సంతాపం తెలియజేస్తున్నారు. మహేష్ తల్లి అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడ అంటే?
శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి గారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు జామున ఇందిరాదేవి గారు తుదిశ్వాస విడిచారు. మరణవార్త వినగానే కుటుంబ సభ్యులంతా హస్పిటల్‌కు చేరుకొన్నారు.

ఇందిరాదేవి పార్థీవ దేహాన్ని బుధవారం ఉదయం 9 గంటలకు అభిమానులు సందర్శన కోసం పద్మాలయ స్టూడియోకు తరలిస్తారు. కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల ఏర్పాట్లలో కుటుంబం ఉన్నారు.


Click it and Unblock the Notifications