గౌతమ్ ఘట్టమనేని హెల్త్ ఇష్యూ.. మహేశ్ బాబు కొడుకుకు అలాంటి సమస్య.. ఏంటంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి గుర్తింపు దక్కించుకున్నారో తెలిసిందే. దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మహేశ్ బాబు నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని కూడా తెలుగు ప్రేక్షకులకులను త్వరలో పలకరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఓవైపు తన స్కూలింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోవైపు నటనలో శిక్షణ కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో గౌతమ్ ఘట్టమనేని డెబ్యూ ఫిల్మ్ గురించి బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహేశ్ బాబు - నమత్రా శిరోద్కర్ ఇద్దరు 2005లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ చిత్రం సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2006 ఆగస్టు 31న వీరికి కొడుకు గౌతమ్ ఘట్టమనేని పుట్టారు. ఇక 2010లో సితార ఘట్టమనేని జన్మించింది. ప్రస్తుతం వీరిద్దరూ తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటూనే సినీ రంగం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ 1 నెనొక్కడినే చిత్రంలో అలరించాడు. ఇక సితార ఘట్టమనేని మోడలింగ్ లో ముందుకు వెళ్తోంది.

Mahesh Babu Son Gautham Ghattamaneni Health Problem at his Birth Time

అయితే ఈరోజు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన రోజు కావడం విశేషం. నేటితో ఆయన 19వ ఏట అడుగు పెట్టాడు. దీంతో గౌతమ్ ఘట్టమనేనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలన్నీ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ పుట్టినప్పుడు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడ్డాడో మహేశ్ బాబు ఒకసారి చెప్పుకొచ్చారు. అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షోలో మహేశ్ బాబు వివరించారు. కాగా తాజాగా ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక గౌతమ్ ఘట్టమనేని పుట్టిన కేవలం మహేశ్ బాబు అరచేతి పొడవు మాత్రమే ఉన్నాడని చెప్పారు.

గౌతమ్ ఘట్టమనేనిది ప్రీమెచ్యూర్డ్ బర్త్ అని మహేశ్ బాబు చెబుతూ బాధ పడ్డారు. కడుపులో ఉన్నప్పుడు పూర్తిగా డెవలప్ కానీ బేబీస్ ను ప్రీమెచ్చూర్ బేబీ అని అంటారు. అలాంటి వారికి శ్వాస తీసుకోవడం, వేడి సమస్య, ఫీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని పుట్టిన వెంటనే NCIUలో కొద్ది కాలం ఉంచుతారు. ఇలాంటి ప్రాసెసే మహేశ్ బాబు గౌతమ్ ఘట్టమనేని కూడా చేయించారు. దాంతో గౌతమ్ ఆరోగ్యం సెట్ అయ్యిందని తెలిపారు. ఇప్పుడు గౌతమ్ 6 అడుగుల పొడవు ఉండటం విశేషం.

అయితే గౌతమ్ ఘట్టమనేని పుట్టినప్పుడు ఏమౌతుందోనని మహేశ్ బాబు ఎంతో భయపడ్డారంట. లక్షలు ఖర్చు చేసి కాపాడుకున్నానని ఎమోషనల్ అవుతూ చెప్పారు. తమకు డబ్బులు ఉన్నాయి. కాబట్టి బతికించుకోగలిగాం. కానీ పేదల పరిస్థితి ఏంటని, అప్పటి నుంచే MB ఫౌండేషన్ స్థాపించి చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్, క్రిటికల్ సిచ్యూయేషన్ లో ఉన్నవారికి వైద్య ఖర్చులు, వైద్య సదుపాయం అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 1000కి పైగా హార్ట్ సర్జరీలు చేయించారు. మున్ముందు మరో 12000 వేల మంది పిలలకు సాయం చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X