Mahesh Babu చేతుల మీదగా మేజర్ పాట.. దుల్కర్ సల్మాన్ కూడా..
దేశ భద్రత కోసం ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్‌పై తెరకెక్కించారు. అడివి శేషు హీరోగా, టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రానికి తిక్క శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేశారు. మలయాళ భాషలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మేజర్ సినిమా ప్రమోషన్స్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని పాటను శుక్రవారం ఉదయం 11.07 గంటలకు మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ చేతులు మీదుగా ఆవిష్కరించనున్నారు. అడివి శేషు, సాయాజీ మంజ్రేకర్‌పై చిత్రీకరించిన హృదయమా అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ పాటను తెలుగులో సిద్ శ్రీరాం పాడగా, మలయాళంలో యువ గాయకుడు ఆర్యన్ పాట ఆలపించారు. హృదయమా అనే తెలుగు పాటను మహేష్ బాబు చేతుల మీదుగా, మలయాళ పాటను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయనున్నారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితానికి సంబంధించిన బాల్యం, యవ్వనం, సైన్యంలో పనిచేసిన రోజుల్లో జరిగిన సంఘటనలను మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల సందర్భంలో సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రతీ ఒక్కరి హృదయాలను కలిచి వేసింది. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ చిత్రాన్ని భావోద్వేగంగా చిత్రీకరించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తెరపైన ఉద్వేగానికి గురిచేస్తాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
నటీనటులు: అడవి శేషు, శోభితా దూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాను మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్‌తో కలిసి సోని పిక్చర్స్ నిర్మిస్తున్నది.


Click it and Unblock the Notifications











