Mahesh Babu గోవాలో ఫైట్.. ఎవరితో ఏం జరిగందంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు సరిలేరు నాకెవ్వరు చిత్రం తర్వాత, గీతా గోవిందం చిత్రం తర్వాత పరుశరాం కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సర్కారు వారీ పాట. శ్రీమంతుడు, రంగస్థలం లాంటి ఇండస్ట్రీకి భారీ హిట్ ఇచ్చిన మైత్రీ మూవీస్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతన్న చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నది. నవీనర్ ఎర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఆర్ మాధి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
వాస్తవానికి పరుశురామ్ సర్కారు వారి పాట సినిమా కంటే ముందు నాగచైతన్యతో నాగేశ్వరరావు అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. కానీ అనుకోకుండా ఆ సినిమా కరోనావైరస్ కారణంగా వాయిదా పడటం, ఆ తర్వాత సర్కారు వారి పాట ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సినిమా 2020 నవంబర్ 27 లాంఛనంగా మొదలైంది. అయితే వరుస లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా షూటింగ్ పలు మార్లు వాయిదా పడుతున్నది. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నది.

ఇటీవల మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన బ్లాస్టర్ పోస్టర్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. దాంతో చిత్ర యూనిట్‌లో కూడా బ్లాక్‌బస్టర్ సినిమాకు పరిచేస్తున్నామనే జోష్ పెరిగింది. సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ మోషన్ పోస్టర్‌కు 29 మిలియన్ల వ్యూస్‌కుపైగా, 850k లైక్స్ రావడం రికార్డుగా మారింది.
ఇక సర్కారు వారీ పాటసినిమాకు సంబంధించిన ప్రస్తుతం గోవాకు మారింది. గోవాలో మహేష్ బాబు, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్, లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో యాక్షన్ సీన్ల చిత్రీకరణ జరుగుతున్నది. గోవాలో జరుగుతున్న ఫైట్ సీక్వెన్స్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫోటో మీడియాలో లీక్ అయింది. మహేష్ బాబు, పరుశురామ్ ఏదో చర్చిస్తుండగా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు శ్రద్దగా ఏదో వింటుడగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఇంటెన్స్ ఫైట్స్ చిత్రీకరిస్తూ యూనిట్ సభ్యుల వెల్లడించారు. సర్కారు వారి పాట సంక్రాంతికి రిలీజ్ కానున్నది.

గోవాలో సర్కారువారీ పాట సినిమా యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్న విషయాన్ని క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సర్కారు వారి పాట టీమ్ గోవాలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2020 రోజున సినిమా రిలీజ్ కాబోతున్నది అంటూ తన ట్వీట్‌లో తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











