twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major first review : శేష్ వన్ మ్యాన్ షో.. సినిమా ఓవరాల్ గా ఎలా ఉందంటే!

    |

    క్షణం, గూడచారి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అయితే ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందు రానుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రివ్యూలు ప్రదర్శించారు కానీ ఎక్కడా రివ్యూ బయటకు రాలేదు. కానీ దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

     శేష్ హీరోగా

    శేష్ హీరోగా


    తెలుగులో సొంతం అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి కర్మ అనే సినిమాతో హీరోగా మారాడు అడివి శేష్. ఆ తర్వాత పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు పోషించి క్షణం సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు. తర్వాత గూడచారి, ఎవరు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

    ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా

    ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా


    శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా రూపొందించారు. ఈ సినిమాని మహేష్ బాబుకు చెందిన ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది.

     తొమ్మిది నగరాలలో

    తొమ్మిది నగరాలలో


    శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలో నటించగా సందీప్ ప్రేయసిగా సాయి మంజ్రేకర్ నటించింది. శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 3వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను తొమ్మిది నగరాలలో 24వ తేదీ నుంచి ప్రీమియర్ షోలు వేస్తున్నారు.

    ఫస్ట్ రివ్యూ

    ఫస్ట్ రివ్యూ


    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో భాగమైన ఉమైర్ సంధు ఈ సినిమా యొక్క ఫస్ట్ రివ్యూ పంచుకున్నారు. అడివి శేష్ ధైర్యసాహసాలు, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి తీసుకున్న కఠినమైన శిక్షణ తెరపై ప్రతిబింబిస్తుంది. ఆయన మొత్తం అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటాడని పేర్కొన్నారు.

     దేశభక్తి కోసం

    దేశభక్తి కోసం


    మేజర్‌లో థ్రిల్లింగ్ లోలాగే గ్రిప్పింగ్ కథనం ఉంది, ఇది జింగోయిస్టిక్‌ను పొందకుండా దేశభక్తిని కలిగిస్తుంది. దేశభక్తి కోసం సినిమాకు వెళ్ళండి అని పేర్కొన్నారు. ఇక ఈ స్పీమా దర్శకుడు శశి కిరణ్ తిక్క దర్శకత్వానికి మూడున్నర స్టార్స్ ఇచ్చాడు. ఈ యాక్షన్ డ్రామాలో అడివి శేష్‌తో పాటు సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Major first review is out. Adivi Sesh steals the show says Umair Sandhu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X