For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయన వల్లే ఈ స్టేజ్ మీద నిలబడ్డా.. మళ్ళీ మళ్ళీ చూశా ట్రైలర్ లాంచ్‌‌లో హీరో

  |

  అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం "మళ్ళీ మళ్ళీ చూశా".. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సెప్టెంబర్ 25న ప్రసాద్ లాబ్స్ జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర, మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ యలమంచలి,నెమో సాఫ్ట్ వేర్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

  హీరోయిన్ శ్వేత అవస్తి మాట్లాడుతూ - " ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా టీమ్ అందరం మూవీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. డైరెక్టర్ హేమంత్ అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా సినిమా చూడండి" అన్నారు.

  Malli Malli Chusa movie trailer launched

  ఎలేంద్ర మహావీర్ మాట్లాడుతూ - " ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.

  చిత్ర నిర్మాత కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ - "మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అతిధులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నా కన్నా మా టీమ్ ఎక్కువ కష్టపడింది. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అనుకుంటున్నాను. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాలకుర్తి అన్ని తానై దగ్గరుండి చూసుకున్నారు. సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

  హీరో అనురాగ్ కొణిదెన మాట్లాడుతూ - " మా నాన్న గారి వల్లే ఈ రోజు స్టేజ్ మీద నిలబడ్డాను. ఆయనే నా హీరో. ఇక డైరెక్టర్ హేమంత్ కార్తీక్ చాలా బాగా తెరకెక్కించారు. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియ‌న్‌చాలా సపోర్ట్ చేసి మంచి ఔట్ ఫుట్ రావడానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాలకుర్తి గారు ఈ మూవీలో నాతో పాటు ట్రావెల్ చేశారు. ఆయనతో మా అసోసియేషన్ ఇక ముందు కూడా కొనసాగుతుంది. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ ఈ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంటారు. ప్రతి ఒక్కరూసినిమా చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది" అన్నారు.

  నెమో సాఫ్ట్ వేర్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ - " ఈ చిత్రం బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కోటేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం ఒక మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్" అన్నారు.

  మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ యలమంచలి మాట్లాడుతూ - "మళ్ళీ మళ్ళీ చూశా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. టైటిల్ లాగే సినిమాను కూడా ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూడాలని, ప్రొడ్యూసర్ కోటేశ్వర్ రావు గారికి మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో స్టూడెంట్ లైఫ్ లవ్ స్టోరీస్ తక్కువగా వస్తున్న ఈ నేపథ్యం లో వస్తున్న'మళ్ళీ మళ్ళీ చూశా' విద్యార్థుల్ని, యువతను బాగా ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ చక్కని హావభావాల్ని వ్యక్త పరిచారు" అన్నారు.

  ఎకె ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర మాట్లాడుతూ - " క్రిషి క్రియేషన్స్ మరో కొత్త నిర్మాణ సంస్థ మన ఇండస్ట్రీ కి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఫస్ట్ మూవీ అయినా చాలా హ్యాపీ గా తీశారు. అది మంచి పాజిటివ్ సైన్. అలాగే హీరో అనురాగ్ కొణిదెన కి స్వాగతం. ఆయనలో మంచి ఈజ్ కనిపించింది. ఇండస్ట్రీ లో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. మళ్ళీ మళ్ళీ చూశా చిత్రం బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. " అన్నారు.

  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి సతీష్ పాలకుర్తి మాట్లాడుతూ - "మళ్ళీ మళ్ళీ చూశా' సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. హీరో అనురాగ్ ఒక ఎక్స్పీరియన్స్ డ్ యాక్టర్ లా నటించారు. ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారి నిర్మాణ విలువలు బాగున్నాయి. టీమ్ అందరి నుండీ మంచి సపోర్ట్ లభించింది. సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుంది' అన్నారు.

  లిరిసిస్ట్ తిరుపతి జావాన మాట్లాడుతూ - " ఈ సినిమాలో అన్ని పాటలు సందర్భానుసారం చక్కగా కుదిరాయి. ఇంతమంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్ "అన్నారు.

  అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్అన్నపూర్ణమ్మ, అజయ్, మధుమణి, ప్రభాకర్, టి.ఎన్. ఆర్, మిర్చి కిరణ్, కరణ్, బాషా, ప్రమోద్, పావని, జయలక్మి, మాస్టర్ రామ్ తేజస్, బంచిక్ బబ్లూ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

  రచన, దర్శకత్వం : హేమంత్ కార్తీక్,

  నిర్మాత : కె. కోటేశ్వరరావు,

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎలేంద్ర మహావీర్,

  సంగీతం : శ్రవణ్ భరద్వాజ్,

  సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల,

  ఎడిటర్ : సత్య గిడుతూరి,

  లిరిక్స్ : తిరుపతి జావాన,

  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :సాయి సతీష్ పాలకుర్తి.

  English summary
  Anurag Konidena is introduced as hero with upcoming film "Malli Malli Chusa". Konidena Koteswara Rao is producing the film directed by Saideva Raman under Krishi Creations Banner. Shweta Avasti and Kairavi Thakkar are the heroines. This movie trailer launched recently.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X