For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘మన్మధుడు 2’ టీజర్: ఇంకా వర్జినా? రొమాన్స్‌ విశ్వరూపం చూపించిన నాగార్జున!

|
Manmadhudu 2 Movie Teaser Review || Filmibeat Telugu

టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో తనలోని అసలు సిసలైన మన్మధుడిని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ్ లేటెస్ట్ మూవీ 'మన్మధుడు 2' విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.

నీకు షెట్టర్లు దించేసి దుకాణం మూసే వయసొచ్చింది. ఈ వయసులో మీకు పెళ్లేంటి? ఎండి పోయిన చెట్టకు నీళ్లు పోస్టే మళ్లీ పూలు పూస్తాయా? పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన టైమ్ లో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంటి? అంటూ నాగార్జునను ఉద్దేశించి పంచ్ డైలాగులు టీజర్లో కిర్రార్ అనేలా ఉన్నాయి.

నాగార్జున వర్జిన్‌గా కనిపించబోతున్నారా?

నాగార్జున వర్జిన్‌గా కనిపించబోతున్నారా?

ఏదైనా జరుగాల్సిన వయసులో జరిగితేనే బావుంటుంది. అది కూడా.... నువ్వు ఇంకా వర్జినే కదరా? అంటూ ఈ మన్మధుడుని టార్గెట్ చేస్తూ ఈ టీజర్ చిత్రీకరించారు. అయితే టీజర్ చివర్లో ట్విస్ట్ ఇస్తూ ‘ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్, ఓన్లీ మేక్ ఇన్ లవ్' అంటూ నాగార్జున తన రొమాంటిక్ విశ్వరూపం చూపించారు.

ఆరోగ్యకరమైన కామెడీతో.. పూర్తి వినోదాత్మకంగా

ఆరోగ్యకరమైన కామెడీతో.. పూర్తి వినోదాత్మకంగా

ఆరోగ్యకరమైన కామెడీతో.. పూర్తి వినోదాత్మకంగా సాగిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. టీజరే ఈ స్థాయిలో ఉందంటే సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి జనాల్లో రేకెత్తించడంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడు.

అభిమానులు అంచనాలకు అందుకునే స్థాయిలో

అభిమానులు అంచనాలకు అందుకునే స్థాయిలో

నాగార్జున కెరీర్లో ‘మన్మధుడు' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా తర్వాతే ఆయన టాలీవుడ్ మన్మధుడిగా పాపులర్ అయ్యారు. తర్వాత ఎన్ని హిట్ సినిమాలు వచ్చినా మన్మధుడిలో ఏదో మిస్సవుతున్నామనే ఫీలింగ్ అలాగే ఉంది. ఇన్నాళ్లకు మళ్లీ అభిమానుల అంచనాలను అందుకునే స్థాయిలో ‘మన్మధుడు 2' మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.

మన్మధుడు 2

ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌‌గా నటించింది. సమంత అతిథి పాత్రలో కనిపించబోతోంది. వెన్నెల కిషోర్, లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని, నిశాంతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... ఛోటా కె ప్రసాద్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్స్‌గా పని చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించాయి. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Manmadhudu 2Shoot of King Nagarjuna's 'Manmadhudu 2' started today. Film is being Produced by Akkineni Nagarjuna, P. Kiran on Manam Enterprises, Anandi Art Creations banners Directed by Rahul Ravindran. Senior writer Satyanand handed over the Script to Director Rahul Ravindran. This movie set to release on 9 August.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more