For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ జగన్ ఆహ్వానం.. ఆ విషయంలో సీరియస్ మీటింగ్!

  |

  మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఎంతో ఓపికతో కొన్నేళ్ల పాటు కొనసాగిన మెగాస్టార్ ఆ తర్వాత అక్కడ మంచి చేసేందుకు ఎలాంటి మార్గం దొరక్కపోవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చి కొత్త తరహా జర్నీని కొనసాగిస్తున్నారు. ఒకవిధంగా రీ ఎంట్రీ ఇచ్చే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో మాదిరిగా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడతాడా లేదా అనే విషయంలో అనేక రకాల సందేహాలు వచ్చాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి ఆ అనుమానాలకు మొదటి అడుగులోనే చెక్ పెట్టారు.

  ఖైదీ నెంబర్ 150 ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడే ఆయనకున్న క్రేజ్ ఏమిటో చాలా ఈజీగా అర్థమైపోయింది. మొదటిరోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ తో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. స్టార్ డమ్ తో పాటు అభిమానుల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గలేదని మెగాస్టార్ చిరంజీవిని ఒక స్టార్ హీరో గానే ఎక్కువగా ఆరాదిస్తున్నట్లు అర్ధమయ్యింది. పాలిటిక్స్ కు దూరంగా ఉన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి పెద్ద రాజకీయాలకు సంబంధించిన విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం లేదు.

  ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా

  ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా

  కానీ నిత్యం జనాల పై ఏదో ఒక రకంగా తన ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్య ఏదైనా సరే తనవంతు కృషిగా స్పందించి ప్రయత్నం చేస్తున్నారు. జనాలు ఎంతో కష్టం ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా పోరాడేందుకు సిద్ధంగానే ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా ఉన్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖులు అని చెప్పవచ్చు.

  మెగాస్టార్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన విషయాలపై వారిద్దరి మధ్య సీరియస్ గా చర్చలు కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.

  చిరంజీవి ట్రస్టు ద్వారా సహాయం

  చిరంజీవి ట్రస్టు ద్వారా సహాయం

  మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఎప్పటిలానే తన సామాజిక సేవలను కొనసాగించారు. రాజకీయాల్లో భారీ స్థాయిలో ఓటమి చెందినప్పటికీ ప్రజలపై ఉన్న మమకారాన్ని ఆయన ఏమాత్రం వదులుకోలేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా చాలా మంది పేదలకు చిరంజీవి ట్రస్టు ద్వారా సహాయం చేసే విధంగా అడుగులు వేశారు. అందులో ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా పాల్గొన్నాడు.

  ముఖ్యమంత్రితో మీటింగ్

  ముఖ్యమంత్రితో మీటింగ్

  సినిమా ఇండస్ట్రీలో ఏ సినీ కళాకారులు ఆకలితో ఉండకూడదని కొన్ని నెలల పాటు మెగాస్టార్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వేలాది మంది కార్మికులను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఆపదలో ఉన్నట్లు తెలిసిన కూడా తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుకు సంఖ్యను సినిమాలకంటే కూడా ఇలాంటి మంచి పనులు తోనే మరింత పెంచుకున్నాడు. ఇక చాలా రోజుల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలవబోతున్న ట్లు తెలుస్తోంది.

  ప్రత్యేకంగా చర్చలు

  ప్రత్యేకంగా చర్చలు

  కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం భారీగా నష్టపోయిన ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ కూడా టాప్ లో ఉందని చెప్పవచ్చు. చాలామంది సినీ కార్మికులు తినడానికి తిండి లేక కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారంపై మెగాస్టార్ చిరంజీవి గతంలోనే కొంత మంది రాజకీయ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రులతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలవాలి అనుకుంటున్నా మెగాస్టార్ కు ఇటీవల పిలుపు అందినట్లు తెలుస్తోంది.

  అందరి చూపు టికెట్ల విషయంపైనే

  అందరి చూపు టికెట్ల విషయంపైనే

  సినీ పెద్దలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని రోజుల్లో వైఎస్ జగన్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. సినీ పెద్దలతో కలిసి రావాలని షేర్ని నాని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తెలియజేసినట్లు సమాచారం. థియేట‌ర్ల స‌మ‌స్య, కార్మికుల బ‌తుకు తెరువు, టిక్కెట్ రేట్ల గురించి చర్చించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందరి చూపు టికెట్ల విషయంపైనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రెగ్యులర్ టికెట్ రేట్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కొన్ని నెలలుగా భారీగా టికెట్ల రేట్లను తగ్గించడంతో పెద్ద సినిమాల కలెక్షన్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

  ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో..?

  ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో..?

  చివరగా వకీల్ సబ్ సినిమా అలాంటి సమస్యలను ఎదుర్కొంది. ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉన్న కొత్త సినిమాలు కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొనే ప్రమాదం ఉంది. నిర్మాతలు ధైర్యం చేయలేక డైరెక్ట్ గా ఓటీటీ లోనే కొత్త సినిమాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అలాగే థియేటర్స్ సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని ఇదివరకే ఒక ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచారు.

  కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా ఆ విషయంపై సానుకూలంగా స్పందన రాకపోవడంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు మరి వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి మెగాస్టార్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఇక మెగాస్టార్ తదుపరి సినిమా ఆచార్య త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న విషయం తెలిసిందే. కొరటాల శివ ఆ సినిమాకు దర్శకత్వం వహించగా రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

  English summary
  Megastar chiranjeevi special meeting with andhra pradesh cm ys jagan mohan reddy
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X