twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA విషయంలో రంగంలోకి చిరంజీవి.. త్వరలో ఆయన్ను కలిసే అవకాశం?

    |

    తెలుగు సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుత ప్యానెల్ పదవీకాలం పూర్తి కాకుండానే ఈ ఎన్నికల వ్యవహారం తెరమీదకు రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే 'మా' విషయంలో రంగంలోకి దిగుతున్న చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    రాజకీయ ఎన్నికలను తలపిస్తూ

    రాజకీయ ఎన్నికలను తలపిస్తూ

    2019లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సినీ నటుడు నరేష్ ఒక ప్యానెల్ గా శివాజీ రాజా ఒక ప్యానెల్ గా బరిలోకి దిగారు. అయితే వీరిద్దరి మధ్య వాదోపవాదాలు ప్రత్యారోపణలు పెద్ద ఎత్తున జరిగాయి. రాజకీయ ఎన్నికల లాగా జరిగిన ఈ ఎన్నికల్లో చివరికి నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.. ఈ ప్యానల్ పదవీకాలం సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది.. ఈ పదవి కాలం ఉండగానే ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఈ ఎన్నికల వ్యవహారం మళ్లీ రసవత్తరంగా మారింది.

    ప్రకాష్ రాజ్ ప్రకటనతో

    ప్రకాష్ రాజ్ ప్రకటనతో

    తాను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో బరిలోకి దిగుతున్నా అంటూ ప్రకాష్ రాజ్ ప్రకటించిన వెంటనే మంచు విష్ణు తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని ప్రకటించారు. జీవిత రాజశేఖర్ ప్రకటించకపోయినా ఆమె ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది, వీళ్ళందరూ బరిలో ఉంటే తాను ఎందుకు ఉండకూడదని నటి హేమ కూడా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అలాగే న్యాయవాది, నటుడు నరసింహారావు కూడా తెలంగాణ వాదంతో తెరమీదకు వచ్చారు.

    అదే అజెండా

    అదే అజెండా


    అయితే మా అధ్యక్షుడిగా ఎంతమంది ఎంతమంది పని చేసినా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఒక సొంత భవనాన్ని నిర్మించుకో లేకపోతున్నారు.. ఎన్ని ప్యానల్స్ ఓటు అడగడానికి వచ్చినా మాకు సొంత భవనం అనే ప్రధాన ఎజెండాతోనే వస్తారు. ఒకసారి అధ్యక్షుడు అయ్యాక ఆ ఊసే మర్చిపోతారు.. నిజానికి ఏడాదికి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు సైతం ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు. అయినా సరే ఈ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ లేకుండా పోయింది.

    కేసీఆర్ తో భేటీ

    కేసీఆర్ తో భేటీ


    ఇప్పుడు ఈ విషయాన్ని భుజానికెత్తుకున్న చిరంజీవి కచ్చితంగా మా బిల్డింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. మా ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తున్నారు అనే విషయాలను పక్కన పెడితే బిల్డింగ్ పూర్తి చేసే పని మాత్రం చిరంజీవి బాధ్యతగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి త్వరలోనే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

    స్థలం కోసం

    స్థలం కోసం

    కెసిఆర్ ప్రభుత్వం కనుక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం స్థలం కేటాయించడానికి సిద్ధంగా లేకపోతే ఒక కమిటీ ఏర్పాటు చేసి మా సొంత బిల్డింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుంది ? దానికి సంబంధించిన ఫండ్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనే అంశం మీద కూడా ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే మోహన్ బాబు ఉ తాను బిల్డింగ్ కోసం అయ్యే ఖర్చులో పావలా వాటా ఖర్చు పెడతానని మాటిచ్చారు.

    ఆ బాధ్యత మొత్తం చిరు మీదే

    ఆ బాధ్యత మొత్తం చిరు మీదే

    ఆ లెక్కన మిగిలిన 75 శాతం కలెక్ట్ కావాల్సి ఉంటుంది. మోహన్ బాబు లాంటి నటుడు పాతిక శాతం ఇస్తుంటే చిరంజీవి ఊరికే ఎందుకు ఉంటారు మిగతా 75% ఇచ్చి బిల్డింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకసారి కేసీఆర్ తో భేటీ అయ్యాక దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    as per latest reports Chiranjeevi along with other celebrities is keen to meet Telangana Chief Minister KCR soon to discuss MAA building issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X