Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Waltair Veerayya Censor Review: ఊరమాస్ ఎలిమెంట్స్‌తో చిరంజీవి.. అంతకుమించిన వినోదంతో బాబీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో అంచనాల స్థాయిని పెంచేస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిశాయి. ఇక అటువైపు నుంచి వచ్చిన టాక్ ఎలా ఉంది అలాగే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనే విషయాలను ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం పదండి..

ఆ స్టైల్ లో మెగాస్టార్
మాస్ కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బాబి మొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేశాడు. ఒక మెగా ఫ్యాన్ ఎలాగైతే మెగాస్టార్ ను చూడాలని అనుకుంటున్నారో ముందుగా ఆ బాడీ లాంగ్వేజ్ ను సినిమాలో హైలెట్ చేసేసాడని ముందే క్లారిటీ వచ్చింది. అప్పట్లో మెగాస్టార్ ఘరానా మొగుడు ముఠామేస్త్రి అలాగే అందరివాడు ఇలా ఎన్నో వేరియేషన్స్ లో కనిపించాడు. ఇప్పుడు ఆ తరహా అన్ని రకాల వేరియేషన్స్ ను కూడా వాల్తేరు వీరయ్య లో చూడబోతున్నారు.

సంక్రాంతికి వింటేజ్ మెగాస్టార్
వాల్తేరు వీరయ్య సినిమాకు సెన్సార్ బోర్డు U/A సరైఫికెట్ ను జారీ చేసింది. ఈ సినిమా మాస్ కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాలు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండనుందట. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి కొంత డిఫరెంట్ జనార్స్ చేసినప్పటికీ కూడా వాల్తేరు వీరయ్య లో మాత్రం వింటేజ్ మెగాస్టార్ తరహాలో కనిపించబోతున్నాడు అనగానే కాంచనలు పెరిగిపోయాయి. సంక్రాంతికి అసలైన పండగ వాతావరణం లో ఈ సినిమాను చూడాలని అనుకుంటున్నారు.

రవితేజ క్యారెక్టర్
వాల్తేరు
వీరయ్య
లో
మాస్
మహారాజ
రవితేజ
కూడా
ఒక
మంచి
నిడివి
ఉన్న
పాత్రలో
కనిపించబోతున్నాడు.
ఇక
అతని
పాత్ర
సెకండాఫ్
లో
తెలంగాణ
యాసలో
మరొక
లెవెల్
లో
ఉంటుంది
అని
తెలిసింది.
అన్ని
మాస్
కమర్షియల్
అంశాలతో
పాటు
హీరోలు
ఇద్దరు
కూడా
మంచి
కామెడీ
టైమింగ్
ఉన్న
ఎపిసోడ్స్
లో
కూడా
అద్భుతంగా
నటించారు
అని
చెబుతున్నారు.

శృతి హాసన్ తో అల్లరి
ఫస్ట్ హాఫ్ లో అయితే మెగాస్టార్ చిరంజీవి మంచి ఫన్ ఎలిమెంట్స్ ఉన్నా సన్నివేశాల్లో ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తారని చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే హీరోయిన్ శృతిహాసన్ తో మెగాస్టార్ చేసే అల్లరి మాములుగా ఉండదట. శృతి హాసన్ చేసే ఒక ఫైట్ లో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉండబోతోందట. ఆ సన్నివేశాలు చాలా హైలెట్ అవుతాయని తెలుస్తోంది.

మెగాస్టార్ స్పెషల్ మూమెంట్స్
ఇక ఈ సినిమాలో స్పెషల్ గా చెప్పుకోవాల్సిందే మెగాస్టార్ డాన్స్ మూమెంట్స్ తో పాటు కొన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా హైలెట్ కాబోతున్నాయి. ప్రతి సాంగ్ లో కూడా మెగాస్టార్ తన టైమింగ్ డాన్స్ స్టెప్పులతో వెండితెరపై విజిల్స్ వేయించే విధంగా అలరించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ కూడా మెగాస్టార్ మార్క్ కు తగ్గట్టుగా ట్యూన్స్ ఇచ్చినట్లు అర్థమవుతుంది.

ఎమోషనల్ సీన్స్ కూడా..
అయితే ఒక సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి అలాగే రవితేజ ఇద్దరు కూడా కలిసి ఎమోషనల్ సన్నివేశాలతో ఆడియన్స్ ను కంటతడి పెట్టించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో వీరి కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలతో పాటు పూనకాలు లోడింగ్ సాంగ్ కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఫాన్స్ అయితే నిరుత్సాహం పడకుండా ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తీసుకువచ్చినట్లు సెన్సార్ యూనిట్ ద్వారా తెలిసింది.