Don't Miss!
- News
Vallabhaneni Vamsi : ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Waltair Veerayya అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాలయ్య తరువాతే మెగాస్టార్ మూవీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత మెగాస్టార్ పూర్తిస్థాయిలో కమర్షియల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అందులోనూ మాస్ యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరపై వస్తూ ఉండడం విశేషం.
కాంబినేషన్ తోనే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలవుతుందని తెలుసు కానీ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు కాస్త ఆలస్యంగా అనౌన్స్ చేశారు.
This Sankranthi, it's time for the MASS MOOLAVIRAT darshanam in theatres 🔥#WaltairVeerayya GRAND RELEASE WORLDWIDE on 13th JAN, 2023 💥
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2022
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/Z7aiNFxOax
ముందుగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన రాబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇక ఆ సినిమా వచ్చిన తర్వాత జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా రాబోతుంది అని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి మాస్ మూల విరాట్ దర్శనం అని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

తప్పకుండా రెండు సినిమాలు కూడా సక్సెస్ అయ్యే విధంగా క్రేజ్ కు తగ్గట్టుగా ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన పార్టీ సాంగ్ కూడా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని సోషల్ మీడియాలో బజ్ చూస్తేనే అర్థమవుతుంది. మరి మెగాస్టార్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.