On Air ఇంట్రెస్టింగ్ లుక్‌తో ఎంజీ శ్రీనివాస్.. హ్యాపీ బర్త్ డే రోజున..
కన్నడ సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ఎంజీ శ్రీనివాస్ అలియాస్ శ్రీని. హీరోగా, దర్శకుడిగా కన్నడలో బీర్బల్ ట్రైయాలజీ, ఓల్డ్ మోంక్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన ఆయన మరో విభిన్న థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆన్ ఎయిర్ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీని రేడియో జాకీగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ ప్రశాంత్ సాగర్ 'ఆన్ ఎయిర్' కు దర్శకత్వం వహించగా వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రఘువీర్ గోరిపర్తి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, చిత్ర కథ ఎంతో వినూత్నంగా ఉండి ప్రేక్షకులకు ఒక విభిన్నమైన చిత్రం చూడబోతున్నాం అనే అంచనాలు ఏర్పరిచింది ఆన్ ఎయిర్.

ఏం జీ శ్రీనివాస్ ఆర్ జేగా నటిస్తున్న ఈ చిత్రంలో తన మొదటి రోజే వచ్చిన ఒక కాల్ ఆర్జే జీవితంలో ఎలాంటి పెను మార్పులు తీసుకొచ్చిందనే కథా నేపథ్యంగా రూపొందింది. చోటుచేసుకున్నాయి అని ఒక వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ఎంతో ఉత్కంఠగా ఆన్ ఎయిర్ తెరకెక్కింది. శ్రీని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన అద్భుత నటనతో ఈ థ్రిల్లర్ ను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు. ఆన్ ఎయిర్ ఎంతో బలమైన కంటెంట్ ను కలిగి ఉండి అంతే స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందింది.
జూలై 9న శ్రీని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆన్ ఎయిర్ గ్లింప్స్ ను విడుదల చేశారు. గ్లింప్సె్ చిత్ర మూడ్ ను తెలియజేసే విధంగా ఉంటూ హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతో ఆకట్టుకుంటోంది.
దర్శక నిర్మాతలు ఆన్ ఎయిర్ ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లడం ఖాయం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ సాగర్ 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఏ మాత్రం రాజీ పడకుండా టాప్ క్లాస్ ప్రొడక్ట్ ఇవ్వాలని ఆన్ ఎయిర్ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవనుంది. అతి త్వరలో ఒక టాప్ ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











