Don't Miss!
- News
APFRS : ఏపీలో ఫేషియల్ అటెండెన్స్-సర్కార్ కీలక ఆదేశం- సర్కులర్ జారీ..!
- Finance
rbi repo: మళ్లీ పెరగనున్న వడ్డీరేట్లు.. రుణ గ్రహీతలకు మరోసారి వడ్డింపు షురూ !!
- Sports
Virat Kohli : కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్.. వీడిని ఆడటం చాలా కష్టమన్న విరాట్!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Mission Impossible 7: ప్రభాస్ టాలెంటెడ్ యాక్టర్.. డైరెక్టర్ క్రిస్టోఫర్ కామెంట్స్..అభిమానులకు బ్యాడ్ న్యూస్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి అనంతరం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే గ్లోబల్ స్టార్ గా కూడా క్రేజ్ అందుకోవడం కాయమని చెప్పవచ్చు. కానీ దానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అయితే ఇటీవల ప్రభాస్ ఒక బిగ్గెస్ట్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నట్లు రూమర్స్ రాగా వాటిపై ఆ చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.
Recommended Video

మంచితనం హార్డ్ వర్క్ వల్లే..
రెబల్ స్టార్ ప్రభాస్ ఏదైనా సినిమా చేశాడు అంటే మినిమమ్ పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రానున్న రోజుల్లో ఈ కటౌట్ హాలీవుడ్ వెండితెరపై కూడా మెరుస్తుందని చెప్పవచ్చు. డార్లింగ్ మంచితనం హార్డ్ వర్క్ అతని కెరీర్ కు ఎంతగానో హెల్ప్ అవుతున్నాయి. నలుగురికి మంచి చేస్తే తప్పకుండా మనకు హెల్ప్ అవుతుందని నిరూపిస్తున్నారు.

హాలీవుడ్ లో డార్లింగ్ పేరు
ఇక ప్రభాస్ తో ఇప్పటికే కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సాహో సినిమాలో ఇంగ్లీష్ యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇక వారి ద్వారా హాలీవుడ్ లో డార్లింగ్ పేరు మరింత వైరల్ అయ్యింది. ఎప్పటికైనా ప్రభాస్ హాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించకపోతాడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మిషన్: ఇంపాజిబుల్ 7లో ప్రభాస్
ఇక ఇటీవల సడన్ ప్రభాస్ పై ఒక రూమర్ వచ్చింది. మిషన్: ఇంపాజిబుల్ 7లో టామ్ క్రూజ్ తో రెబల్ స్టార్ మొదటిసారి పవర్ఫుల్ సపోర్టింగ్ రోల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. అంతే కాకుండా MI 7 దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కూడా భారతీయ నటుడు ప్రభాస్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించటానికి ముందుకు వచ్చారని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.

క్లారిటీ ఇచ్చిన క్రిస్టోఫర్ మెక్‌క్వారీ
ఇక ఫైనల్ గా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ క్లారిటీ ఇచ్చేశాడు. అతను టాలంటేడ్ మ్యాన్. కానీ మేము ఎప్పుడు కలవలేదు. ఇంటర్నెట్ కు స్వాగతం.. అని మిషన్: ఇంపాజిబుల్ 7 దర్శకుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. హాలీవుడ్ మీడియాలో కూడా రూమర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో ఆ దర్శకుడు ఈ విధంగా వివరణ ఇవ్వక తప్పలేదు.

అప్సెట్ అయినప్పటికీ..
మొత్తానికి కన్ఫ్యూజన్ లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఇది నిజమనుకున్న అభిమానులు కాస్త అప్సెట్ అయినప్పటికీ క్రిస్టోఫర్ మెక్‌క్వారీ లాంటి అగ్ర దర్శకుడు ప్రభాస్ ను టాలెంటెడ్ మ్యాన్ అంటూ పొగడడం అభిమానులకు ఒక మంచి కిక్కయితే ఇస్తోంది. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ హాలీవుడ్ సినిమా
ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరిలో ఎవరు చేయని అతిపెద్ద భారీ ప్రయోగమని తెలుస్తోంది. ఇక సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొనె నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు.