మా మీద బతుకుతూ... ఎందుకీ చిల్లర పనులు, బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడిగా, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ రైట్ హ్యాండ్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ వాసు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాతగా అల్లు అరవింద్ కనిపిస్తున్నా.. తెర వెనుక వ్యవహారాలు చక్కబెట్టేది బన్నీ వాసు అన్న సంగతి ఇండస్ట్రీ జనాలకు తెలిసిందే. ఈ క్రమంలోనే జీఏ2 బ్యానర్‌పై చిన్న సినిమాలు తీస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన సొంతంగా బీవీ వర్క్క్ బ్యానర్‌ను స్థాపించి మిత్రమండలి అనే సినిమాను నిర్మించారు. ఎప్పుడూ సరదాగా ఉండే బన్నీ వాసు ఇటీవలి కాలంలో దూకుడుగా కనిపిస్తున్నారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

అక్టోబర్ 16న మిత్రమండలి
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల ఈ మిత్రమండలి సినిమాను నిర్మించారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా... రాజీవ్ కుమార్ రామ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిత్రమండలి సినిమాకు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా... సిద్దార్థ్ ఎస్టే సినిమాటోగ్రఫి, పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు.

Mithra Mandali Producer Bunny Vasu Makes sensational Comments on Book My Show Ratings

నా వెంట్రుక కూడా పీకలేరు
సినిమా రిలీజ్ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు ఎమోషనల్ అయ్యారు. సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని.. కానీ జనాలు సినిమా బాగుంటేనే చూస్తారని, లేకపోతే చూడరని... డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదు అనుకుంటే అది చిన్నపిల్లల మెంటాలిటీ అన్నారు. ఓ సినిమా వస్తుంది దానికి నెగిటివ్ కామెంట్స్ చేస్తామనుకుంటే అంతా దేవుడు చూసుకుంటాడని బన్నీ వాసు వ్యాఖ్యానించారు. తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరని ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి.

టార్గెట్‌గా నెగిటివ్ ట్రోలింగ్
తాజాగా మిత్రమండలి టీమ్ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో బన్నీ వాసు... నెగిటివ్ రివ్యూలపై విరుచుకుపడ్డారు. సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ చేయించడానికి కొంతమంది పనిచేస్తున్నారు. అదేదో చెత్త స్ట్రాటజీ.. అదోక శాడిజం, సైకోయిజం అనొచ్చు. ఇంత కష్టపడి సినిమాలు తీస్తున్నాం. కొన్ని కామెంట్స్ చాలా జెన్యూన్‌గా రాశారు.. వాటికి 100 శాతం మెచ్చుకుంటున్నా, కానీ ఒకటే దానిని రిపీట్‌గా కొట్టడం, లేదంటే ఒకే డైలాగ్‌ను అటు ఇటూ కొడుతుంటే నాకు అనుమానం వచ్చింది. నా ఒక్కడికే కాదు.. చాలా సినిమాలకు ఇది జరిగింది. రెండు మూడు సినిమాలు ఒకేసారి వస్తున్నప్పుడు ఇలాగే జరిగింది. నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ దీనిపై మాట్లాడుతూ చాలా బాధపడ్డారు. అలాగే ఓ హీరో కూడా మాట్లాడారు అని బన్నీ వాసు చెప్పారు.

Take a Poll

బుక్ మై షోపై బన్నీ వాసు ఫైర్
బుక్ మై షోలో వన్ వన్ వన్ అని మొదలుపెడతాడు.. ఒక 20, 30 లైనుగా పడిపోతాయి. ఒక 50 దగ్గర ఆగుతుంది. మళ్లీ మనోళ్లు ఎవరైనా సినిమా చూసినవాళ్లు ఎవరైనా కొడుతుంటే మళ్లీ మొదలుపెడతారు. ఇవన్నీ చీప్ టాక్టిక్స్.. బుక్ మై షో వాళ్లను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.. సినిమాలు బాగుంటే మీరు బాగుంటారు. మీ సైట్‌లో కూడా మీరు ఇలాంటి కాంపిటీషన్ పెడితే.. ఏ సినిమాకు ఎంత రేటు... ఆ సినిమాకు ఎంత రేటు. మీ సైట్‌లోకి వచ్చి సినిమాలు కొనే వాళ్లకైనా ఒక ప్లెయిన్ మైండ్‌తో సినిమా చూపించండి. ముందు రేటింగ్ తీసేయండి.. 9.8, 9.9, 4.5 ఎందుకిలా. బతికే మనం సినిమాల మీద. ఒక రివ్యూ రాసేవాళ్లు ఉన్నారంటే.. వాళ్లు సినిమాను చూసి విశ్లేషణాత్మకంగా రాసి మాకు ఇలా ఇలా నచ్చిందని చెబుతారు. అది వ్యాపారం కాదు.. అది విశ్లేషణ, జర్నలిస్టులుగా వాళ్ల డ్యూటీ. బుక్ మై షో యాప్‌లో టికెట్లు అమ్ముకుంటూ కమీషన్ తీసుకునే మనం కూడా ఒక సినిమా బాగుంది, బాలేదని రేటింగ్ ఇవ్వొద్దు. యాప్‌లో రేటింగ్ కొడుతున్న దానికి అథంటికేషన్ అయినా ఉండాలి, అది ఉండదు, దానికి మెకానిజం ఉండదు, మీ దాంట్లో లైకులు ఎలా పడుతున్నాయో చూడరు. అలాంటప్పుడు రేటింగ్ ఇవ్వడం ఎందుకు అని బన్నీ వాసు ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X