For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగార్జున బర్త్‌డే ముందు శుభవార్త చెప్పిన అఖిల్.. ఫుల్ ఖుషీలో అక్కినేని అభిమానులు

  |

  అక్కినేని నట వారసుడిగా తెరంగ్రేటం చేసిన అఖిల్ ఇప్పటి దాకా సాలిడ్ హిట్ ఒకటి కూడా అందుకోలేదు. అందుకే ఆయన అనేక కథలు విన్న తర్వాత ఫైనల్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేశారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. కొద్ది సేపటి క్రితం ఈ సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. ఆ వివరాల్లోకి వెళితే

  మంచి కధలతో

  మంచి కధలతో

  నాగార్జున రెండో కుమారుడు అఖిల్ సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇంకా మాటలు రాని వయసులోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల అందరిని మెప్పించాడు. తరువాత మనం సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించాడు. ఇక ఆయన హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో తెరంగ్రేటం చేశాడు.. అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే బోల్తాపడటంతో తర్వాత సినిమాల్లో చాలా జాగ్రత్తగా చేయాలని ప్లాన్ చేసుకున్న అఖిల్ మంచి దర్శకులు, ఎంచుకుంటున్న కథలు కూడా విభిన్నంగా ఉండే విధంగా ఎంచుకుంటూ ముందుకు వెళ్లడం స్టార్ట్ చేశారు.

  మూడు సినిమాలు చేసినా

  మూడు సినిమాలు చేసినా

  అందులో భాగంగానే విక్రమ్ దర్శకత్వంలో హలో అనే సినిమా చేశారు. ఈ సినిమా కథ ప్రకారం బాగానే ఉన్నా ఎందుకో గాని సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు సరికదా కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే సంపాదించింది. ఈ సినిమా తరువాత మిస్టర్ మజ్ను అనే సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేశాడు అఖిల్ అక్కినేని. ఈ సినిమా కథ కూడా పర్వాలేదు అనిపించుకున్నా సినిమా కలెక్షన్ల విషయంలో అలాగే టాక్ విషయంలో కూడా ఇబ్బంది పడ్డాడు. దాదాపు మూడు సినిమాలు రిజల్ట్స్ ఇబ్బంది పెట్టడంతో ఎలా అయినా ఈసారి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సీనియర్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు.

  ఎప్పుడో మొదలుపెట్టినా

  ఎప్పుడో మొదలుపెట్టినా

  పూజా హెగ్డే హీరోయిన్ గా అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమాను 2019 సంవత్సరంలో ప్రారంభించారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు వాసు వర్మ బన్నీ వాసు తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు ఫిబ్రవరి 2020 వ సంవత్సరంలో ప్రకటించారు. ప్రకటించిన కొద్ది రోజులకే కరోనా కారణంగా సినిమా షూటింగ్ ను నిలిపివేయాలి వచ్చింది.

   దసరాకి ఫీస్ట్

  దసరాకి ఫీస్ట్

  అన్ని సినిమాల లాగే ఈ సినిమా కూడా కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవ్వడంతో సినిమా రిలీజ్ విషయం కూడా లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అని కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 13వ తేదీన విడుదల కావాల్సి ఉన్న రాజమౌళి, ఎన్టీఆర్- రామ్ చరణ్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా సినిమాలను ఇప్పుడు దసరాకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

  Pooja Hegde's Emotional Note | ఆమె ఫోన్ కాల్స్ ఇక నాకు రావు అంటూ..!!
  ఒక్క రోజు ముందు ఫీస్ట్

  ఒక్క రోజు ముందు ఫీస్ట్

  ఇక ఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఒక యన్.ఆర్.ఐ పాత్రలో నటించబోతుండగా పూజా హెగ్డే మాత్రం విభా అనే పేరుతో ఒక స్టాండప్ కమెడియన్ పాత్రలో నటించబోతోందని అంటున్నారు. ఈషా రెబ్బా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని లాంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా సంగీతం కూడా బాగా కుదిరింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన మనసా మనసా అనే సాంగ్ అయితే ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించింది. ఇక నాగార్జున పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ఈ ప్రకటన రావడంతో అక్కినేని అభిమానులు అయితే ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత అక్కినేని అఖిల్ కి కలిసొస్తుందో లేదో అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  Akhil Akkineni-Pooja hegde's Most Eligible Bachelor to release in theatres on 𝐎𝐜𝐭ober 𝟖𝐭𝐡 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X