Mukhachitram Trailer review సౌండ్ ఎఫెక్ట్ లేకుండా కామెడీ.. ముఖచిత్రం ట్రైలర్‌లో విశ్వక్ సేన్ పంచులు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా నిర్మాణంలో గిరిధర్ దర్శకత్వం వహించిన చిత్రం ముఖ చిత్రం. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, ఆయేషా ఖాన్, చైతన్య రావు, సునీల్, రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రం డిసెంబర్ 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ముఖ చిత్రం సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే...
క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ముఖచిత్రం కోర్టు డ్రామాగా తెరకెక్కినట్టు ట్రైలర్‌లో స్పష్టమైంది. ఈ చిత్రం మెడికల్ ఎలిమింట్స్ అంటే.. ప్లాస్టిక్ సర్జరీ చేసే చిన్న మ్యాజిక్‌తో కథ అనేక మలుపులు తిరిగిందనే విషయాన్ని దర్శకుడు గిరిధర్ చెప్పకనే చెప్పాడు. సీనియర్ నటుడు రవిశంకర్, విశ్వక్ సేన్ మధ్య కోర్టు సీన్లు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారే అవకాశం కనిపించింది.

ముఖ చిత్రం ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు, డైలాగ్స్ ఆసక్తిని రేపేలా ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ అనేది మెడికల్ రంగంలో ఓ అద్బుతం. అందరికి అర్ధం కానిది.. కానీ చాలా ఫేమస్ అంటూ డైలాగ్స్ ఈ కథ ప్రాముఖ్యతను చెప్పాయి. ఇక కోర్టు హాలులో రవిశంకర్, విశ్వక్ సేన్ మధ్య వాగ్వాదం టెంపోను క్రియేట్ చేసింది. వశిష్ట (రవిశంకర్) సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా నవ్విస్తున్నాడు అంటూ విశ్వక్ సేన్ సెటైర్ వేశాడు. ట్రైలర్‌లో డైలాగ్స్ కథలోని ఇంటెన్సిటీని చెప్పేలా ఉంది.
నటీనటులు: విశ్వక్ సేన్, వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, ఆయేషా ఖాన్, చైతన్య రావు, సునీల్, రవిశంకర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: సందీప్ రాజ్
దర్శకత్వం: గిరిధర్
సమర్పణ: ఎస్కేఎన్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా
సహ నిర్మాతలు: రమ్య చౌదరీ, కే విజయ్ కుమార్
మ్యూజిక్: కాలభైరవ
డీవోపీ: శ్రీనివాస్ బెజుగమ్
ఎడిటర్: పవన్ కల్యాణ్ కొదాటి
బ్యానర్: పాకెట్ మనీ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2022-12-09


Click it and Unblock the Notifications











