Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చేతికి ఏది దొరికితే దాంతో థమన్ ను కొట్టేవాడిని.. భయంతో దాక్కునేవాడు: మణిశర్మ
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్s లిస్ట్ తీస్తే అందులో మణిశర్మ టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. మెలోడీ బ్రహ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఆయన ఇటీవల కాలంలో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయినప్పటికీ ఆయన మంచి టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో మణిశర్మ తన దగ్గర వర్క్ చేసిన శిష్యులలో థమన్ ఒకరు అని అతనిని పై కోప్పడిన సందర్భం గురించి కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

అలీ షోలో మణిశర్మ
మెలోడీ బ్రహ్మగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మణిశర్మ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు సీనియర్ అగ్ర హీరోలందరి సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ అందిస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న మణిశర్మ తన సినీ ప్రయాణం గురించి గుర్తు చేసుకుంటూ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో ఉన్న అనుభవాలను కూడా ఆయన పంచుకున్నారు.

అసిస్టెంట్ గా థమన్
ఇక తన దగ్గర వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఇప్పుడు ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు అని అందులో ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ థమన్ కూడా ఉన్నారు అని మణిశర్మ తెలియజేశారు. ముఖ్యంగా తమన్ చాలా కాలం పాటు తనకు అసిస్టెంట్ గా కూడా ఉన్నాడు అని అతను కీబోర్డ్ ప్లేయర్ గా కూడా కొనసాగినట్లు వివరణ ఇచ్చారు.

కోపం వచ్చేది
చూడాలని ఉంది సినిమా తర్వాత నేను ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయాను. అప్పట్లో అగ్ర హీరోలు అందరికీ కూడా నేను మ్యూజిక్ అందించే అవకాశం లభించింది. అయితే మహేష్ బాబు అర్జున్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న సమయంలోనే థమన్ నా దగ్గరకు వచ్చాడు. అతను చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. అయితే కొన్నిసార్లు మాత్రం అనుకున్న పనులు మాత్రం సమయానికి పూర్తి చేయకపోవడంతో చాలా కోపం వచ్చేది.

చేతిలో ఏది ఉంటే..
అప్పుడున్న పని ఒత్తిడి అలాంటిది. సమయానికి ట్యూన్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉండేది. అయితే నాకు కోపం కూడా చాలా ఉండేది. నేను కొన్నిసార్లు కోపంతో చేతిలో ఏది ఉంటే దాని తీసుకొని థమన్ కొట్టేవాడిని. కొన్నిసార్లు థమన్ మానిటర్ వెనకాలకు వెళ్లి దాక్కునేవాడు. ఆ విధంగా భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

నా దగ్గర వర్క్ చేసినప్పుడు..
నాకు కోపం చాలా ఎక్కువ కానీ అది అప్పుడే వచ్చే అప్పుడే తగ్గిపోతుంది. ఏదైనా వర్క్ వరకే నాకు కోపం ఉండేది. పర్సనల్ గా ఎవరిమీద ఎలాంటి కోపం చూపించేవాడిని కాదు. నా దగ్గర వర్క్ చేసినప్పుడు థమన్ ఎంతో పేషెన్స్ తో చాలా విషయాలు నేర్చుకున్నాడు. అతని ఓపిక ఈరోజు అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. అతను ఈ స్థాయికి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.. అని మణిశర్మ తెలియజేశారు.