For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Naga Chaitanya: మాస్ యాక్షన్ అవతారంలో నాగ చైతన్య.. ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్!

  |

  జోష్ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య తనదైన శైలీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ ఫలితాలాతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాంట్రవర్సీ విషయాలకు దూరంగా ఉండే చైతూ ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అంతగా విజయం సాధించలేదు. ఇక హిందీలో లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చైతూ తెలుగు, తమిళం బైలింగ్యువల్ ప్రాజెక్ట్ గా వచ్చిన చిత్రం కస్టడీ. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ క్యూరియాసిటీ పెంచగా తాజాగా మరో వీడియోను వదిలారు మేకర్స్.

   గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వంలో..

  గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వంలో..

  తెలుగు చిత్ర సీమ మన్మథుడు, కింగ్ నాగార్జున కుమారుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన చైతూ సినీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకున్నా కథ పరంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ మూవీ అక్కినేని ఫ్యాన్స్ ను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. ఇక ఆ మూవీ తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య. ఏ మాయ చేశావే సినిమాలో ముద్దు సీన్లు, నటనతో యూత్​ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు.
  ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు.

  మే 12న ప్రేక్షకుల ముందుకు..

  మే 12న ప్రేక్షకుల ముందుకు..

  ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. కస్డడీ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. నాగ చైతన్యకు ఇది తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను వదిలారు మేకర్స్. ఈ వీడియోలో పెద్దగా డీటేయిల్ ఏం ఇవ్వలేదు. చాలా తక్కువ నిడివితో గ్లింప్స్ విడుదల చేశారు.

  26 సెకన్ల పాటు..

  26 సెకన్ల పాటు..

  26 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో పల్లెటూరి మధ్యలో వెళ్తున్న బొగ్గు రైలును ముందుగా చూపించారు. తర్వాత రోడ్డు మీద వెళ్తున్న పోలీసు వెహికిల్స్, జాతర సెటప్, ఆ వెంటనే బ్లాస్ట్ చూపించారు. తర్వాత స్మోక్ ఎఫెక్ట్ మధ్యలో నుంచి నాగ చైతన్య ఎంట్రీ ఇవ్వడం బాగుంది. రెండు మూడు యాక్షన్ కట్స్ తో గ్లింప్స్ మాస్ గా ఉంది. చూస్తుంటే నాగ చైతన్యతో పవర్ ఫుల్ యాక్షన్ స్టంట్స్ చేయించినట్లు తెలుస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్న ఈ గ్లింప్స్ ను న్యూ ఇయర్ కానుకగా అక్కినేని అభిమానుల కోసం రిలీజ్ చేశారు.

   విలన్ గా అరవింద్ స్వామి..

  విలన్ గా అరవింద్ స్వామి..

  ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించగా కృతీ శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, తదితరులు కీలక పాత్రలుపోషిస్తున్నారు. కస్టడీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకేసారి పనిచేయడం ఇదే తొలిసారి.

  English summary
  Tollywood Hero Naga Chaitanya And Venkat Prabhu Combination Movie Custody Latest Glimpse Released For Akkineni Fans As New Year 2023 Gift.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X