For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Love Story రిలీజ్‌పై క్లారిటీ: మూవీ కోసం అప్పటి వరకూ వేచి చూడాల్సిందేనట

  |

  ఈ మధ్య కాలంలో వరుసగా హిట్టు మీద హిట్టు అందుకుంటూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఈ ఉత్సాహంతోనే అతడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైనప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఇది ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీంతో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.

  యాంకర్ రవికి మానస్ వార్నింగ్: ఆమెతో ఎఫైర్ ఉందని అనడంతో ఫైర్.. అతడి స్థాయి అదే అంటూ షాకింగ్‌గా!

  నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన'లవ్ స్టోరీ' మూవీని ఎప్పుడో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. కానీ, కరోనా రెండో దశ కారణంగా ఇది సాధ్య పడలేదు. దీంతో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని అప్పట్లో యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక, ఇప్పుడు ఆ పరిస్థితులు చక్కబడడంతో పాటు థియేటర్లు చక్కగా నడుస్తున్నాయి. దీంతో ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా ఇది వాయిదా పడిపోయింది.

  Naga Chaitanyas Love Story Release on October First Week

  'లవ్ స్టోరీ' మూవీని సెప్టెంబర్ 10న విడుదల చేయాలని అనుకున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ, నైట్ కర్ఫ్యూ అమలలో ఉండడం, ఇదే రోజు నాని నటించిన 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదల కాబోతుండడం వంటి కారణాలతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది ఎప్పుడు విడుదల అవుతుందన్న దానిపై చాలా రకలా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం 'లవ్ స్టోరీ' చిత్రాన్ని అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

  ఆ కంటెస్టెంట్‌కు నాగబాబు సపోర్ట్: బిడ్డ లాంటి వాడంటూ కామెంట్.. అభిజీత్ గెలిచినట్లే తను కూడా!

  ప్యూర్ రొమాంటిక్ జోనర్‌లో క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అత్యధిక మొత్తంలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి అన్నీ వీలైన తర్వాత దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే అక్టోబర్ మొదటి వారంలో అయితే పరిస్థితులు అనువుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఈ సినిమా కోసం సామాన్య ప్రేక్షకులతో పాటు అక్కినేని అభిమానులు మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, దీని నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

  English summary
  Naga Chaitanya and Sai Pallavi Doing Love Story Movie Under Sekhar Kammula Direction. This Film will be Release on October First Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X